NTV Telugu Site icon

భువనేశ్వరి గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదు: టీడీపీ నేత అనురాధ

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాధ విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాను వైసీపీ కార్యకర్తలే ఛీ కొడుతుంటే పారిపోయి తమ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి రోజా మాట్లాడటం సిగ్గుచేటు అని అనురాధ ఆరోపించారు. వైసీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఫస్ట్రేషన్‌తో రోజా తమ మేడమ్‌పై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోందని.. రోజా నాలుక తెగ్గోస్తామని హెచ్చరించారు. సూర్పణఖకు పట్టిన గతే రోజాకు టీడీపీ మహిళలు పట్టిస్తారని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.

Read Also: నారా భువ‌నేశ్వ‌రికి రోజా కౌంట‌ర్ 

చిత్తూరు జిల్లాలో వరదలు వస్తే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమ మేడమ్ భువనేశ్వరి స్వయంగా స్పందించి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున బాధితులకు సహాయం అందించారని అనురాధ వెల్లడించారు. భువనేశ్వరి తన వంతుగా రూ.49 లక్షలు ఆర్థిక సహాయం చేశారని గుర్తుచేశారు. అలాంటి మనిషిని అభినందించాల్సింది పోయి విమర్శించడానికి రోజాకు సిగ్గుండాలన్నారు. రోజాకు భువనేశ్వరి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కరోనా సమయంలోనూ భువనేశ్వరి బాధితులకు సహాయం అందించారని.. రోజా ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కనీసం స్పందించలేదన్నారు. మహిళా అధికారులను వైసీపీ నేతలు సోషల్ మీడియాలో హెరాస్ చేస్తుంటే రోజా మాట్లాడలేదన్నారు. వనజాక్షి మాటను ఇంకా ఎన్నాళ్లు రోజా వాడుకుంటుందని అనురాధ ప్రశ్నించారు. భువనేశ్వరిని వైసీపీ నేతలు ఏం అనకపోతే స్వయంగా మీడియా సాక్షిగా ఎందుకు క్షమాపణలు చెప్పారని రోజాను అనురాధ నిలదీశారు. జగన్‌ను పొగడటం తప్ప ప్రజల గురించి ఏనాడైనా రోజా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.

Show comments