Devineni Uma: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ ప్రజా సమస్యలను తీర్చేందుకు తెలుగుదేశం- జనసేన- బీజేపీ పార్టీలు కృషి చేస్తున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. ఐదేళ్ల తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలక్టివ్ ఆర్టిస్టుల కోసం తాడేపల్లి ప్యాలస్ తలుపులు తీశాడు.. వాలంటీర్ల వ్యవస్థ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రభుత్వం అందుకు అనుగుణంగా వ్యవహరిస్తుంది.. ప్రభుత్వంపై కుట్రలు పన్నుతూ శవ రాజకీయాలకు జగన్ పాల్పడుతున్నాడు అని దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు.
Read Also: Stock market: మరోసారి రికార్డులు సృష్టించిన స్టాక్ మార్కెట్
ఇక, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక ఫించన్లను ఉదయం 10 గంటల్లోపే 80 శాతం పంపిణీ చేయించి రికార్డు సృష్టించాం అన్నారు. వాలంటీర్ల ద్వారా మాత్రమే ఫించన్ల పంపిణీ సాధ్యమన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఎన్నికల ముందు అవ్వా తాతల జీవితాలతో ఆటలాడుకున్నాడు.. రాజకీయ దురుద్దేశంతో సామాజిక ఫించన్ల పంపిణీని కార్యక్రమం అనే ఆలోచనా ధోరణిని ఇప్పటికైనా వైసీపీ వీడాలి అని సూచించారు. ఇంకా రెచ్చగొట్టే ధోరణిలోనే ఉన్న జగన్ అహంకార విధానాలకు భంగపాటు తప్పదు అంటూ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు.