NTV Telugu Site icon

Ration Rice: తమిళనాడు సీఎంకు చంద్రబాబు లేఖ

Chandrababu

Chandrababu

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు లేఖ రాశారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా విషయాన్ని లేఖ ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. ఆంధ్రప్రదేశ్‌-తమిళనాడు సరిహద్దుల్లో జోరుగా రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగుతోందన్న ఆయన.. తమిళనాడు-చిత్తూరు సరిహద్దుల్లోని 7 మార్గాల ద్వారా రైస్ మాఫియా బియ్యం తరలిస్తున్నారని.. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో గట్టి నిఘా పెంచాలని లేఖలో పేర్కొన్నారు. అంతే కాదు, స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ వాహనాలు, స్మగ్లర్ల ఫొటోలను స్టాలిన్‌కు రాసిన లేఖకు జత చేసి పంపించారు చంద్రబాబు నాయుడు.

Read Also: Viral: సింహంతో ఆటలా..? ఇలాగే ఉంటుంది మరి..!

Show comments