Site icon NTV Telugu

రైతుల మహాపాదయాత్రతో జగన్‌కు చలి జ్వరం.. అచ్చెన్నాయుడు సెటైర్లు

అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది… అయితే, ఈ పాదయాత్రలో పాల్గొనకుండా.. టీడీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేస్తూ వస్తున్నారు పోలీసులు.. ఇక, ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. రైతుల మహాపాదయాత్రకు వస్తున్న స్పందన చూసి జగన్‌కు చలి జ్వరం పట్టుకుందని వ్యాఖ్యానించిన ఆయన.. మహాపాదయాత్ర రాజకీయ యాత్ర కాదు.. భావితరాల భవిష్యత్ యాత్రగా అభివర్ణించారు.. రాజధాని మార్పుపై ఇచ్చిన మాటను తప్పినందుకు జగన్ సహా వైసీపీ నేతలందరూ సిగ్గుతో తలదించుకోవాలని మండిపడ్డ అచ్చెన్నాయుడు.. పోలీసులను అడ్డం పెట్టుకుని పాదయాత్రను అడ్డుకుంటున్నారని.. ఎన్నికల కోడ్ ఆపాదించి అడ్డుకోవడం న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించడమే అవుతుందన్నారు. ఇక, అధికార దాహంతో జగన్ పాదయాత్ర చేస్తే.. రాష్ట్రం కోసం రైతులు పాదయాత్ర చేస్తున్నారని.. జగన్ రెడ్డి చేసిన మోసానికి వైసీపీకి చెందిన రైతులు కూడా బోరుమంటున్నారని తెలిపారు అచ్చెన్నాయుడు.

Exit mobile version