Site icon NTV Telugu

టీడీపీ ప్రతిపక్షంగా వైఫల్యం చెందింది: తమ్మినేని సీతారాం

టీడీపీ ప్రతిపక్షంగా వైఫల్యం చెందిందని ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పై పలు విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రజల విశ్వాసానని కోల్పోయారన్నారు. ఓటీఎస్‌ పై టీడీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆయన తెలిపారు. అధికారంలోకి రాగానే పట్టాలిస్తామంటున్న టీడీపీ నేతలు అధికారంలో ఉండగా కుంభకర్ణుడిలా నిద్రపోయారంటూ ఎద్దేవా చేశారు.

Read Also: పచ్చమందకు పైత్యం బాగా ముదిరింది: విజయసాయిరెడ్డి

ప్రతిపక్ష నేతలు సంస్కారం లేని మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజలే న్యాయ నిర్ణేతలు.. ఏది మంచి ఏది చెడు అనేది ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. అన్నీ ఫ్రీ అని చెప్పిన బాబును ప్రజలు తిరస్కరించారని తమ్మినేని అన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని పెంచటం కసమే సంపూర్ణ హక్కు పథకం తీసుకొచ్చామని తమ్మినేని సీతారాం తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయడం మంచిది కాదని తమ్మినేని టీడీపీని ఉద్దేశించి అన్నారు.

Exit mobile version