పచ్చమందకు పైత్యం బాగా ముదిరింది: విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్‌ వేదికగా టీడీపీ పై విమర్శలు గుప్పించారు.‘పచ్చ’ మందకు పైత్యం బాగా ముదిరిపోయిందని నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి. ట్విట్టర్‌లో ఆయన పచ్చ’ మందకు పైత్యం బాగా ముదిరిపోయింది. ఆంధ్రప్రదేశ్ చచ్చిపోయిందంట. వరల్డ్ మ్యాప్ లోంచి ఏపీ అదృశ్యమైందంట! 5 కోట్ల మంది వీళ్లకు మనుషుల్లా కనిపించడం లేదా? అధికారం పోగొట్టుకుని పొర్లిపొర్లి ఏడుస్తున్నారు. మా బాబే సీఎం అని గ్రాండ్ గా ఒక సినిమా తీసుకుని మురిసిపోండి. వేరే మార్గం లేదు. అంటూ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు.

Related Articles

Latest Articles