అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన అల్లుడు మంజునాథ రెడ్డి అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లెలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆయన ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.. ఆయన వయస్సు 36 సంవత్సరాలు.. అయితే, దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్టు వైద్యులు ప్రకటించారు.
Read Also: Monkeypox Test Kit: మొట్టమొదటి స్వదేశీ మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ విడుదల
అయితే, మంజునాథరెడ్డి ఆత్మహత్యపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన రెడ్డి అండ్ రెడ్డి అనే కంపెనీని నిర్వహిస్తున్నారని, అప్పుడప్పుడు కుంచనపల్లిలోని నివాసానికి వస్తుంటారని వెల్లడైంది. ఆర్థిక ఇబ్బందులు.. లేదంటే కుటుంబ కలహాల కారణంగా ఆయన బలవన్మరణానికి పాల్పడి ఉంటారని తెలుస్తోంది.. ఇక, మంజునాథరెడ్డి ఆత్మహత్యపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మణిపాల్ ఆస్పత్రిలో మంజునాథ రెడ్డి మృతదేహం ఉండగా.. ఆస్పత్రికి చేరుకున్నారు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి… ఎమ్మెల్యేతో పాటు మంజునాథ రెడ్డి తల్లి దండ్రులు, భార్య ఆస్పత్రిలో ఉన్నారు.. మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తరలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
