సాధారణంగా గుండె వ్యాధులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం వుంటుందని భావిస్తారు. కానీ ప్రైవేట్ ఆసుపత్రులను మించి అత్యాధునికమైన గుండెకు సంబంధించిన వైద్యాన్ని అందిస్తున్నారు విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. గుండె వ్యాధిగ్రస్తులకు పూర్తి భరోసా ఇస్తున్నారు. గుండెకు సంబంధించిన వ్యాధి వచ్చిందంటే వెంటనే గుర్తుకు వచ్చేది ప్రైవేట్ ఆసుపత్రి. కానీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ప్రైవేటు ఆసుపత్రిలో అందించే వైద్యం ఇక్కడ అందించటం విశేషం. అంతే కాకుండా ఇక్కడ విజయవంతంగా అరుదైన గుండె చికిత్సలు, మరియు ఖరీదైన రోటాబ్లేషన్, ప్రైమరీ యంజియోప్లాస్టీలు వంద శాతం సక్సెస్ రేట్ తో నిర్వహిస్తున్నారు.
దీంతో గుండె వ్యాధిగ్రస్తులకు భరోసా ఇస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నిలుస్తుంది. దాదాపు 4 లక్షల నుంచి 6 లక్షల వరకు ఖర్చు అయ్యే రోటాబ్లేషన్, యాంజియేప్లాస్టీల్ పరీక్షలు ఉచితంగా చేస్తూ రోగులకు భరోసా నింపుతున్నారు. రోగి ఛాతిలో నొప్పి వస్తే ఆసుపత్రికి వచ్చిన గంటల వ్యవధిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి రోగులకు అవసరం అయిన వైద్యం అందిస్తున్నారు. అంతే కాదు ప్రతిరోజు ఆసుపత్రిలో గుండెకు సంబంధించి ఓపీ విభాగం వుంటుందని వైద్యులు చెబుతున్నారు.
ఒకప్పుడు ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ వుండేది కాదని ప్రస్తుతం గుండెకు సంబంధించిన అన్ని రకాల ఎక్విప్ మెంట్ లు అందుబాటులోకి వచ్చాయని వైద్యులు అంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా లేని విధంగా లామినర్ ప్లో, ఐసీయూ వార్డులు వుండటంతో గుండె వ్యాధిగ్రస్తులు ప్రభుత్వాసుపత్రికి క్యూ కడుతున్నారు.
ఇటీవలే ప్రైమరీ యంజియోప్లాస్ట్ లతో పాటుగా యాంజియోప్లాస్ట్ లను విజయవంతంగా చేశామని వంద శాతం ఇక్కడికి వచ్చే గుండె వ్యాధిగ్రస్తులకు వారి జీవితానికి భరోసా ఇస్తున్నామని అంటున్నారు వైద్యులు. ఐసీయూలో వున్న పేషంట్స్ సైతం తమకు చికిత్స బాగా అందుతుందని అంటున్నారు, పూర్తి స్థాయిలో కార్డియాలజీ వైద్యులు వుండటంతో ప్రతిరోజూ 10 వరకు యాంజియోగ్రామ్ , యాంజియోప్లాస్ట్ లు నిర్వహిస్తున్నాం అంటున్నారు వైద్యులు.
IND Vs SA: గుడ్‌న్యూస్.. విశాఖ టీ20కి 100 శాతం ప్రేక్షకులకు ఎంట్రీ