భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ–సీ52 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లాంచ్ ప్యాడ్ నుంచి దీనిని ప్రయోగించారు. 25 గంటలపాటు కౌంట్‌డౌన్ ముగించుకుని సోమవారం ఉదయం 5.59 గంటలకు ప్రయోగించిన రాకెట్ నింగిలో లక్ష్యం దిశగా వెళ్లింది. ఇది మూడు ఉపగ్రహాలను రోదసీలోకి తీసుకెళ్తోంది. ఇస్రో ఈ ఏడాదిలో చేపడుతున్న మొదటి ప్రయోగం ఇదే కావడం గమనార్హం. శ్రీహరికోట PSLV C 52 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోటలో శాస్త్రవేత్తల సంబరాలు చేసుకుంటున్నారు.
కక్ష్యలోకి రి శాట్ తో పాటు ఇన్ స్పైర్… INS 2TD ఉపగ్రహాలను రాకెట్ ప్రవేశపెట్టింది. ప్రయోగతీరుపై ఇస్తో చైర్మన్ సోమ్ నాథ్ హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే PSLV C53 రాకెట్ ప్రయోగం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వ్యవసాయ, అటవీ, నీటి వనరుల సమాచారం కోసం ఆర్‌ఐశాట్-1 ఉపగ్రహం, భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహం ఐఎన్‌ఎస్-2టీడీ అని సోమనాథ్ వెల్లడించారు.