NTV Telugu Site icon

Students Fighting: విద్యార్థుల మధ్య ఘర్షణ.. కాలేజ్‌లోనే కొట్టుకున్న సీనియర్లు, జూనియర్లు

Students Fighting

Students Fighting

విద్యార్థులు కాలేజీలోనే కొట్టుకున్నారు.. ల్యాబ్‌లో ప్రాక్టికల్స్‌ చేసే వస్తువులతోనే పరస్పరం దాడులకు దిగారు.. కలకలం సృష్టించిన ఈ ఘటన కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్‌లో జరిగింది. కాలేజీలోనే సీనియర్లు, జూనియర్లు గొడవకుదిగారు.. బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్.. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌ పై దాడికి దిగారు.. ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ చేసే వస్తువులతో కొట్టుకున్నారు. గత కొంతకాలంగా జూనియర్లు, సీనియర్లు మధ్య వార్‌ నడుస్తున్నట్టుగా తెలుస్తుండగా.. ఇప్పుడు అది దాడి వరకు వెళ్లింది… గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కి తరలించారు తోటి విద్యార్థులు.. ఈ దాడిలో గాయపడిన విద్యార్థులు ఫైనల్ ఇయర్‌కు చెందిన విద్యార్థులు సాయి తేజ, సాయిగా గుర్తించారు.. దాడి చేసిన విద్యార్థులు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ నాగేంద్ర, సందీప్‌గా చెబుతున్నారు.. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ పొడవడంతో ఇద్దరు ఫైనల్ ఇయర్ విద్యార్థులకి కుట్లు కూడా పడ్డట్టు తెలుస్తోంది.

Read Also: YV SUbba Reddy: కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు టీటీడీ ఆలయాల నిర్మాణం..