Audio Leak: శ్రీశైలం క్షేత్రంలో ఆడియో లీక్ కలకలం.. సీరియస్‌గా స్పందించిన మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Audio Leak:ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం లీక్ అయిన ఓ ఆడియో కలకలం సృష్టిస్తోంది.. అభిషేకాలు అమ్మకానికి పెట్టారు ట్రస్ట్ బోర్డులో ఓ మహిళా సభ్యురాలు.. పీఏతో బేరసారాలపై మాట్లాడిన ఆడియో అంటూ సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్‌గా మారిపోయింది.. మల్లికార్జునస్వామికి అభిషేకాలు, స్పర్శ దర్శనాల పేరుతో దోపిడీ చేయడమే ప్లాన్‌గా ఈ వ్యవహారం నడుస్తోంది.. స్వామివారి గర్భాలయ అభిషేకం టికెట్లు లేకపోయినా.. గర్భాలయ అభిషేకాలు చేయిస్తామంటున్న ధర్మకర్తల మండలిలోని ఓ సభ్యురాలు ఆ ఆడియోలో చెబుతున్నారు.. గర్భాలయ అభిషేకాలు టికెట్లు లేకుండా.. గర్భాలయ అభిషేకాలు చేయించుకునే భక్తులు ఎవరైన ఉంటే పార్టీలను పట్టుకురా.. అంటూ ఆ సభ్యురాలు మధ్యవర్తులతో సంభాషించినట్టు ఆ ఆడియోలో ఉంది.. మల్లికార్జునస్వామి దర్శనాల పేరుతో దళారుల దందా మధ్యవర్తులతో ట్రస్ట్ బోర్డ్ లోని ఓ సభ్యురాలు భక్తులకు ఎర వేయడం ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది.
Read Also: IT Rides in Aditya Homes: మూడవరోజు ఐటీ సోదాలు.. ఉద్యోగులపై చేయి చేసుకున్నారని ఆరోపణ
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్‌ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
అయితే, శ్రీశైలం క్షేత్రంలో జరుగుతోన్న ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. పశ్చిమగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆడియో కలకలంపై స్పందించారు.. దైవ దర్శనాలు, అభిషేకాల పేరుతో డబ్బు సంపాదించుకోవాలని చూడటాన్ని సహించబోమని హెచ్చరించారు.. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ పద్మజ మాట్లాడినట్టుగా ఆడియోలో తెలుస్తుందన్నారు.. అభిషేకాలకు డబ్బులు డిమాండ్ చేయడం సరైన పద్ధతి కాదని సూచించారు.. ఈ ఘటనపై విచారణ కమిటీ వేసి నిజా నిజాలు పరిశీలిస్తాం. తప్పు చేసినట్టు తేలితే ట్రస్ట్ బోర్డు నుంచి తొలగిస్తామని ప్రకటించారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!