Wipro Layoffs: ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.. ఆర్థికమాంద్యం ఎఫెక్ట్‌తో దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగులను తగ్గించుకునే పనిలోపడిపోయాయి.. ఇప్పటికే ఐటీ రంగంలో లక్షలాది మంది ఉద్యోగులు కోల్పోయారు.. ఫ్రెషర్లను కూడా వదలడం లేదు.. ఖర్చు తగ్గించుకోవడం ఒకటైతే.. నైపుణ్యం లేనివారిని కూడా ఇంటికి పంపిస్తున్నాయి ఆయా సంస్థలు. తాజాగా, ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో వందలమంది ఫ్రెషర్లకు షాకిచ్చింది. పేలవమైన పనితీరు కారణంగా ఫ్రెషర్స్‌ను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొంది.. దేశంలోని అగ్రశ్రేణి ఐటీ కంపెనీలలో ఒకటైన విప్రో వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. తొలగించబడిన ఉద్యోగులందరూ ఫ్రెషర్లు మరియు అంతర్గత పరీక్షలలో పేలవమైన పనితీరు కనబరిచినందున వారిని తొలగించారు. శిక్షణ ఉన్నప్పటికీ పరీక్షల్లో పదే పదే విఫలమవడంతో 452 మంది ఫ్రెషర్లను తొలగించాల్సి వచ్చిందని విప్రో తెలిపింది.
శిక్షణ ఉన్నప్పటికీ పరీక్షల్లో పదే పదే విఫలమవడంతో మేం 452 మంది ఫ్రెషర్లను తొలగించాల్సి వచ్చింది అని మీడియా పోర్టల్‌ల ప్రశ్నలకు సమాధానంగా విప్రో తెలిపింది. తొలగించబడిన ఉద్యోగులందరికీ వారి తొలగింపు లేఖలు అందాయి. ఉద్యోగులందరికీ శిక్షణ కోసం కంపెనీ రూ.75,000 ఖర్చు చేసిందని, షరతుల ప్రకారం పరీక్షలో ఫెయిల్ అయిన తర్వాత చెల్లించాల్సి ఉంటుందని, అయితే, ఈ మొత్తాన్ని కంపెనీ మాఫీ చేసిందని లేఖలో పేర్కొన్నారు. కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో, విప్రోలో, మేం అత్యున్నత ప్రమాణాలను ఏర్పరచుకున్నాం.. దాని గురించి మేం గర్విస్తున్నాం.. ఈ ప్రమాణాలకు, మేం మా కోసం ఏర్పరచుకున్న ఈ ప్రమాణాలకు అనుగుణంగా, కొత్త ఉద్యోగులందరూ కంపెనీలో చేరాలని మేం భావిస్తున్నాం.. కేటాయించిన పనిలో నిర్దిష్ట నైపుణ్యాన్ని సాధించడానికి, మేం వారికి శిక్షణ కూడా ఇస్తుంటామని పేర్కొంది.
ఇక, ఉద్యోగులు సంస్థ యొక్క లక్ష్యాలను మరియు మా క్లయింట్‌ల అవసరాలను పరిగణనలోకి తీసుకునే ఒక మదింపు ప్రక్రియ ద్వారా వెళ్తాం.. పనితీరు మదింపు యొక్క ఈ క్రమబద్ధమైన ప్రక్రియ దశల శ్రేణిని అనుసరిస్తుంది. మెంటార్ అందించడం మరియు తిరిగి శిక్షణ ఇవ్వడం మొదలైనవి. కొన్నిసార్లు కొంతమంది ఉద్యోగులను కంపెనీల నుంచి వెళ్లేలా కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని విప్రో పేర్కొంది. ఇదిలావుండగా, జనవరి 20వ తేదీ శుక్రవారం బీఎస్‌ఇలో విప్రో షేర్లు స్వల్పంగా 0.05 శాతం క్షీణించి రూ.403.15 వద్ద ముగిశాయి.. గత నెలలో కంపెనీ షేర్లు 3.46 శాతం లాభపడ్డాయి. అయితే, గత ఏడాది కాలంలో దీని ధర దాదాపు 33 శాతం తగ్గింది. విప్రో డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. FY23 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత లాభం 15 శాతం పెరిగి రూ.3,053 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో కంపెనీ ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 3.1 శాతం పెరిగి రూ.23,055.7 కోట్లకు చేరుకుంది.