ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీశైలం,కాశీపీఠాధిపతులు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని కాశీ జ్ఞానసింహాసన నూతన పీఠాధిపతి మల్లికార్జున విశ్వరాధ్య,శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్దరామాశివాచార్య దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న పీఠాధిపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు, ఆలయచైన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి సాదర స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారి అభిషేకం జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. పీఠాధిపతుల వెంట వివిధ మఠాలకు సంబంధించిన మఠాధిపతులు కూడా విచ్చేసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ సంప్రదాయాలను అనుసరించి పీఠాధిపతులకు శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు సమర్పించారు. మరోవైపు సెలవులు కావడంతో శ్రీశైలానికి భక్తుల రద్దీ పెరిగింది. శ్రీశైల క్షేత్రంలోని టోల్ గేట్ సమీపంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున హిందూ మాల సత్రంలో నూతనంగా నిర్మించిన 14 రూములు కలిగిన బి-బ్లాక్ భవనం ప్రారంభమయింది.
దేవస్థానం సూచించిన నియమ నిబంధనలకు లోబడి సత్రంలో పని చేయాలని, క్షేత్రానికి వచ్చే భక్తులకు కులమతాలకతీతంగా గదులు ఇవ్వాలని సూచించారు. భక్తులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని అన్నారు. సత్రం ప్రాంగణంలో, గదులలో పరిశుభ్రతను పాటించాలని సత్రం యాజమాన్యానికి ఈవో లవన్న సూచించారు.
Gold Rates: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి
