శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎప్పుడు ఎత్తుతారు.. ఆ దృశ్యాలు ఎప్పుడు చూడాలని అంటూ కృష్ణా నదిలో వరదలు ప్రారంభం అయినప్పటి నుంచి ఎంతో మంది పర్యాటకులు ఎదురుచూస్తున్నారు.. హైదరాబాద్ సహా తెలంగాణలోని అనేక ప్రాంతాల నుంచే.. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు ఈ సమయంలో తరలివస్తుంటారు.. ఇక, శ్రీశైలం మల్లన్న దర్శనానికే వచ్చే భక్తులు సరేసరి.. మొత్తంగా వారికి గుడ్‌న్యూస్.. ఎందుకంటే.. ఇవాళ శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తనున్నారు.. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వరదనీరు వచ్చి చేరుతుంది దీనితో జలాశయం నిండుకుండలా జలకళను సంతరించుకుంది శ్రీశైలం డ్యాం వరదనీటితో గరిష్ఠ స్థాయికి చేరువలో ఉంది. దీంతో జలాశయం క్రస్ట్ గేట్లు ఎత్తెందుకు అధికారులు సమాయత్తం అయ్యారు.
Read Also: Astrology on July 23rd 2022: జులై 23, శనివారం దినఫలాలు
శ్రీశైలం జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతుంది. అయితే, వరద ఉధృతి మాత్రం కాస్త తగ్గిందనే చెప్పాలి.. ఇన్ ఫ్లో రూపంలో ప్రస్తుతం 81,853 క్యూసెక్కుల నీరు వచ్చి శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతండగా.. ఔట్ ఫ్లో 57,751 క్యూసెక్కులుగా ఉంది.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే.. ప్రస్తుతం 882.50 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 202.0439 టీఎంసీల నీరు ఉంది.. మరోవైపు.. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.. కాగా, శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 882.50 అడుగులకు చేరుకుంది. దీంతో.. ఇవాళ శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లు ఎత్తెందుకు సమాయత్తం అవుతున్నారు అధికారులు.. ఇప్పటికే శ్రీశైలం చేరుకున్న ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. ఉదయం 11 గంటలకు శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు.