విదేశాల్లో ఉంటున్న మన భారతీయులు మన ఖ్యాతిని చాటిచెబుతున్నారు. ఎంతోమంది ఎన్నారైలు వివిధ దేశాల్లో వివిధ పదవులకు పోటీపడుతూ.. తమ ఉనికిని చాటుకుంటున్నారు. తాజాగా శ్రీపాద ఫణిశాస్త్రి ఇటు ఆంధ్రప్రదేశ్, భారత్ ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన శ్రీపాద ఫణి శాస్త్రి జెనీవా అసెంబ్లీకి పోటీ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. స్విట్జర్లాండ్ లోని జెనీవా స్టేట్ గ్రాండ్ కౌన్సిల్ కి (మన ఎమ్మెల్యే హోదా) శ్రీపాద ఫణి శాస్త్రి పోటీ చేస్తున్నారు. ఆ దేశంలో ఎన్నికల బరిలో నిలిచిన మొట్ట మొదటి భారతీయుడిగా ఇప్పటికే చరిత్ర సృష్టించారు ఫణిశాస్త్రి.
ఏప్రిల్ 2వ తేదిన పోలింగ్ జరగనుంది. వంద స్థానాలు ఉన్న జెనీవా అసెంబ్లీకి 690 మంది పోటీ చేస్తున్నారు. బరిలో దిగిన మొత్తం 12 పార్టీల అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జెనీవాలో ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకటైన గ్రీన్ పార్టీ తరఫున రంగంలో నిలిచారు ఫణి శాస్త్రి. ఆయన మొత్తం 48,000 ఓట్లలో మెజారిటీ ప్రజల మద్దతు పొందవలసివుంది.
Read Also: Lakshmi Panchami: లక్ష్మీపంచమి నాడు ఈసోత్రం వింటే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు మీసొంతం
అక్కడ 70 శాతం ఓటర్లు ప్రవాసీయులే కావడం విశేషం. వీరిలో 30 శాతం పైగా పోర్చుగల్ దేశస్థులు ఉన్నారు. భారతీయ ఓటర్లు మాత్రమే 2,500 మంది ఉన్నారు. స్విట్జర్లాండ్ లో 165 దేశాలకు చెందిన ప్రవాసీయులు నివాసం ఉంటున్నారు. స్విట్జర్లాండ్ పేరుచెబితే అదో మినీ వరల్డ్ లా ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఏజన్సీలో చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు ఫణి శాస్త్రి. గత 20 సంవత్సరాలుగా స్విట్జర్లాండ్ లో నివాసం ఉంటున్నారు ఫణి. ప్రవాసీయుల సంక్షేమం, ప్రయోజనాల పరిరక్షణ ప్రధాన అజెండాగా ఫణి విభిన్న శైలిలో జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. జెనీవా అసెంబ్లీకి ఎన్నికై భారతీయ ఖ్యాతిని పెంచాలని మనమూ ఆశిద్దాం. బెస్టాఫ్ లక్ ఫణి శాస్త్రిజీ..
Read Also: IPL 2023 : CSK పతనానికి అదే కారణం?.. “డాడ్స్ ఆర్మీ”కి మాథ్యూ హేడెన్ వార్నింగ్