Seediri Appalaraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 రోజులుగా అతలాకుతలం అయిపోతుందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ఓ పక్కా రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి.. మరో వైపు వైసీపీ హయాంలోని వచ్చిన మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు.. గూగుల్ డేటా సెంటర్ తో నకిలీ మద్యం, మెడికల్ కాలేజీల అంశాన్ని డైవర్ట్ చేస్తున్నారు.. ఈ అన్ని వ్యవహారాల మద్య ఓ కొత్త వాదనను కూటమి నేతలు తెరపైకి తీసుకొస్తున్నారు.. వైసీపీ హయాంలో 5 మెడికల్ కాలేజీల్లో క్లాసులు మొదలైయ్యాయి, మరో 2 క్లాసులకు సిద్దం చేశాం.. కానీ, కూటమి నేతలు అసలు వైసీపీ టైంలో మెడికల్ కాలేజీలు కట్టలేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పునాదుల దశలో ఉన్న ఫోటోలు చూపించి మంత్రులు సత్యకుమార్ యాదవ్, హోం మినిష్టర్ అనిత వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలు కట్టలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కూటమి నేతలకు NMC ( నేషనల్ మెడికల్ కౌన్సిల్) షాక్ ఇచ్చింది.. వైఎస్ జగన్ హయాంలో ప్రారంభమైన 5 మెడికల్ కాలేజీలకు ఇప్పుడు NMC పీజీ సీట్లు కూడా కేటాయించింది అని సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.
Read Also: Diwali Festival 2025: దీపావళి పండగ రోజు దీపాలు ఎందుకు ముట్టిస్తారో తెలుసా..?
ఇక, వైసీపీ టైంలో ప్రారంభం కాకుండానే ఇప్పుడు పీజీ సీట్లు వచ్చాయా? అని మాజీ మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. కూటమి నేతల అబద్దపు ప్రచారాన్ని ప్రజలు గుర్తించాలి.. మెడికల్ కాలేజీలను చూస్తే జగన్ గుర్తు రాకుండా వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు.. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. లులూ మాల్ కి ప్రభుత్వం ఉచితంగా భూమి ఇవ్వడం ఏంటి?.. షాపింగ్ మాల్స్ తో ఎకో సిస్టం క్రియేట్ అవుతుందా?.. ప్రజలందరూ ఇప్పుడు గూగుల్ గురించి మాట్లాడుతున్నారు.. గూగుల్ డేటా సెంటర్ గురించి వైసీపీ హాయంలోనే ఎంఓయూ కుదిరింది అని తేల్చి చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ తో పాటు ఎకో సిస్టం క్రియేట్ అయ్యేలా ఎంఓయూ చేసుకున్నాం.. ఇప్పుడు కేవలం డేటా సెంటర్ మాత్రమే వచ్చింది.. గూగుల్, అదానీ జాయింట్ వెంచర్ లో వచ్చిన ఈ డేటా సెంటర్ కి 20 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం ప్రయోజనం కల్పిస్తోంది అని సీదిరి అప్పలరాజు చెప్పుకొచ్చారు.
Read Also: Maoists : మల్లోజుల, ఆశన్నలు విప్లవద్రోహులుగా మారారు
అలాగే, చంద్రబాబును ఏమైనా అడిగితే సంపద సృష్టిస్తా అంటున్నారు.. నిజంగా సంపద సృష్టిస్తే ప్రజలు ఈ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారా? అని మాజీ మంత్రి అప్పలరాజు క్వశ్చన్ చేశారు. రూ.4500 కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీలు పూర్తి అవుతాయి. కానీ, రూపాయి కూడా పెట్టుబడి పెట్టారు.. యోగా డే కోసం వందల కోట్లు ఖర్చు చేస్తారు. మోడీ వస్తే వందలు కోట్లు ఖర్చు చేస్తారు.. రెండున్నర కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జి కోసం రూ.2500 కోట్లు ఖర్చు చేస్తారంట. ఇంత కంటే సిగ్గు చేటు ఉంటుందా?.. ప్రజలకు ఉపయోగపడే పనులకు డబ్బు లేదంటారు.. ప్రైవేట్ వ్యక్తులకు మాత్రం ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెబుతున్న సంపద సృష్టి ప్రైవేట్ వ్యక్తులకు పరిమితం.. గతంలో వైజాగ్ పై తప్పుడు ప్రచారం చేశారు.. ఇప్పుడు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూస్తోంది.. ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ వైజాగ్ అని సుందర్ పిచ్చాయ్ అన్నారు.. వైజాగ్ కు అంత గొప్ప పేరు జగన్ వలనే వచ్చిందని అప్పలరాజు వెల్లడించారు.
