శ్రీకాకుళం జిల్లా పలాసలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. చదువు ద్వారా పేదరికం రూపు మాపడానికి ప్రయత్నిస్తున్నారు అని ఆయన వ్యాఖ్యనించారు. అమ్మవడే కాదు అన్ని అంశాలలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు.. మాకు ఇద్దరు మామలు, చందమామ, జగన్ మామ అంటున్నారు పిల్లలు అని ఆయన చెప్పుకొచ్చారు. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు అని స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు.
Read Also: IND vs SA: సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యం.. సెంచరీతో అదరగొట్టిన కింగ్ కోహ్లీ
ఆరోగ్యశ్రీ , జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టారు అని స్పీకర్ తమ్మినేని సీతారం వెల్లడించారు. నేను పేదల పక్షాన ఉంటానని, మేలు చేస్తేనే ఓటు వేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటున్నారు అని ఆయన తెలిపారు. సీఎంగా మళ్లీ జగన్ ని చేస్తేనే భవిష్యత్ బాగుంటుందని వ్యాఖ్యనించారు. చారిత్రక అవసరం ఉంది.. అలా కాకుంటే దేశం కుడా క్షమించదు అని ఆయన పేర్కొన్నారు. సామాజిక సాధికార యాత్రనే కాదు స్వాభిమాన యాత్ర కూడా అని స్పీకర్ తమ్మినేని సీతారం చెప్పారు.
Read Also: Jabardasth: జబర్దస్త్ కు కొత్త యాంకర్.. రంగంలోకి దిగిన జవాన్ బ్యూటీ
ఇచ్చేవాడికి పుచ్చుకునే వాడి మధ్య మరో చేయి లేదు అని స్పీకర్ తమ్మినేని సీతారం పేర్కొన్నారు. బటన్ నొక్కితే అంతా పెదల ఖాతలకు వస్తుంది.. గతంలో పించన్ కోసం కొట్లాటలు, లంచాలు ఉండేవి.. ప్రస్తుతం అలాంటివి ఎక్కడ కనిపించడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి సీఎంను మనం మరోసారి గెలిపించుకోవాలని తెలిపారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి చెందిన 175 మందిని గెలిపించి 175 మంది ఎమ్మెల్యేలను సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు.