NTV Telugu Site icon

Koona Ravikumar: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ని ఇంటికి సాగనంపడం కాయం

Kuna Ravikumar

Kuna Ravikumar

Koona Ravikumar: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ ని ఇంటికి సాగనంపడం కాయమని మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అన్నారు. జగన్ బురదను అందరికి అంటించాలని చూస్తున్నారని తెలిపారు. ఆధారాలు లేకుండా చంద్రబాబుని నిర్బంధించారని మండిపడ్డారు. లేని రింగ్ రోడ్డులో అవినీతి ఏంటి అని ప్రశ్నించారు.? కేంద్రం డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా.. ఏర్పాటు చేసింది ఫైబర్ గ్రిడ్ కార్యక్రమమన్నారు. 5 వేల ప్రాజెక్ట్ ని 280 కోట్లకే పూర్తి చేసారని తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రేట్లు పెంచేసారని పేర్కొన్నారు.

Read Also: CM Jagan: అక్టోబరు 26 నుంచి బస్సు యాత్ర.. అత్యంత ముఖ్యమైన కార్యక్రమమన్న జగన్‌

అన్ని స్కీంలను స్కాంలుగా మార్చిన వ్యక్తి జగన్ అని కూన రవికుమార్ విమర్శించారు. చంద్రబాబు వ్యవహారంలో సిఐడి చీఫ్ దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విజయవాడలో కేసు పెడితే.. హైదరాబాద్ లో, డిల్లీలో ప్రెస్ మీట్లు ఏంటని ప్రశ్నించారు.? ఏపీలో మద్యం అమ్మకాలపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని బీజేపినే కేంద్రానికి ఫిర్యాదు చేసిందని తెలిపారు. చంద్రబాబుని బయటకు రానివ్వకుండా సీఎం జగన్ మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకి బెయిల్ కూడా రాకుండా జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారన్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రికి తెలియదా? చెప్పడానికి కూడా సిగ్గుపడాలిగా అని దుయ్యబట్టారు.

Read Also: Khalistan: “ఇండియాపై హమాస్ లాంటి దాడి”.. ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూ బెదిరింపులు..