Kasibugga Stampede: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తొక్కిసలాటలో 12 మంది మృతి చెందిన దుర్ఘటనపై దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి దేవాదాయశాఖ ఉన్నత అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నాను.. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. సమాచారం అందిన వెంటనే జిల్లా మంత్రి అచ్చం నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో మాట్లాడిన వివరాలు అడిగి తెలుసుకున్నాను అని మంత్రి ఆనం పేర్కొన్నారు.
Read Also: Indian Student Arrested: స్టోర్ లో దొంగతనం చేస్తూ పట్టుబడిన మరో భారతీయ విద్యార్థిని..
ఇక, ఈ తొక్కిసలాటలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందచేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అదేశాలు జారీ చేశారు. దీంతో హుటాహుటిన శ్రీకాకుళం బయలుదేరిన దేవాదాయశాఖ ఉన్నత అధికారులు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటన జరిగిన ఆలయం దేవాదాయశాఖ పరిధిలో లేదు అన్నారు. అది పూర్తిగా ప్రైవేట్ ఆలయం.. నిర్వాహకులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని తెలిపారు. ప్రభుత్వానికి నిర్వాహకులు సమాచారం ఇవ్వలేదు.. ముందే సమాచారం ఇస్తే సరైన జాగ్రత్తలు తీసుకునే వాళ్లమని చెప్పారు. ఈ తొక్కిసలాట బాధాకరమైంది.. మహిళలు, పిల్లలు చనిపోవడం బాధాకరంగా ఉంది.. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.. కలెక్టర్, ఇతర అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారని మంత్రి ఆనం వెల్లడించారు.