NTV Telugu Site icon

Divvala Madhuri: మాది పవిత్రబంధం.. అదంతా రాజకీయ కుట్రే..!

Divvala Madhuri

Divvala Madhuri

Divvala Madhuri: మాది అపవిత్రబంధం కాదు.. పవిత్రబంధం.. విడాకులు తీసుకున్నాక ఇద్దరం కలసి ఉంటాం అంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి.. తాజాగా, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఈ జంట.. అక్కడ ఫొటోలు, వీడియోలకు పోజులు ఇవ్వడం చర్చగా మారింది.. అదే వివాదాలు తెచ్చిపెట్టింది.. దివ్వెల మాధురిపై తిరుమలలో కేసు నమోదైంది. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆమెపై తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ సందర్భంగా ఎన్టీవీ ప్రత్యేకంగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిని ప్రశ్నించింది.. కానీ, కొండమీద రీల్స్ చేయలేదు. ఒక్కఫొటో అయినా ఉందా..? నేను ఫొటోగ్రాపర్స్ ని తీసుకువెళ్లలేదన్నారు మాధురి.. వద్దని చెబుతున్నా.. కొందరు నా వెంటపడి వీడియోలు, ఫొటోలు తీశారన్నారు.. అయితే, మాది అపవిత్ర బంధం కాదు.. పవిత్రబంధంగా చెప్పుకొచ్చారు..

Read Also: MS Dhoni New Haircut: వారెవ్వా.. కుర్రాడిలా మారిపోయిన ఎంఎస్ ధోనీ..

ఇక, కార్యకర్తలం అందరం కలసి తిరుమల దర్శనానికి వెళ్లాం.. ఏడు , ఎనిమిది , తోమ్మిది తేదీలలో నా మీద ఎందుకు కేసులు పెట్టలేదు అని ప్రశ్నించారు దివ్వెల మాధురి.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పై వాఖ్యలు చేసిన తరువాతనే 10వ తేదీన కేసు నమెదు చేశారని విమర్శించారు.. రాజకీయ కుట్రలో బాగంగానే కేసులు పెట్టారని ఆరోపించారు.. మెన్నటి వరకూ లడ్డూ అన్నారు. నేడు మాధురి మాడవీదిలో తిరిగిందంటున్నారు. దేవుడిని రాజకీయంగా లాగవద్దు. కొండమీద మాటాడకూడదని తెలియదు. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాం. గతంలోనూ మాడవీదులు తిరిగాను , నాట్యం చేశాను అన్నారు. అయితే, తనపై నమోదైన కేసులో న్యాయపరంగా అన్ని కేసులు ఎదుర్కుంటాను అన్నారు.. దువ్వాడ పై ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా దువ్వాడను ఎవరూ ఏం చేయలేరు. ఇండిపెండెంట్ గా పోటీచేసినా గెలుస్తారు. టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ను ఎదిరించే వారు ఎవరూ లేరన్నారు..

Read Also: Minister Ramprasad Reddy: వ్యాపారులను వేధిస్తే సహించేది లేదు..

ఇంటిలో ప్రేమ , ఆప్యాయత కోల్పోయారు. దువ్వాడకు మేం తోడుగా ఉంటాం అన్నారు మాధురి.. అందరి దృష్టిలో దువ్వాడ శ్రీనివాస్‌ ఏజ్ 58.. నాదృష్టిలో అతను 30 ఏజ్.. ఈ జనరేషన్ తో కాకుండా ముందు ఉంటారు. దువ్వాడ దగ్గర నేర్చుకునేందుకు చాలా ఉంది. ఏజ్ నాట్ ఎ ప్యాక్టర్.. దువ్వాడ ప్రతి అడుగులో నేను వెనకుండి నడిపిస్తాను. దువ్వాడను మంత్రిగా చూడాలన్నది నా కళ అన్నారు దెవ్వెల మాధురి.. ప్రజాజీవితంలో మేం ఉంటాం.. నేడు అడుగుపెట్టిన తరువాతనే టిక్కెట్ వచ్చింది. రాజకీయాలు నాకు ఇష్టమే కానీ దువ్వాడ వద్ద ఓనమాలు నేర్చుకుంటాను అన్నారు మాధురి.. నా భర్త బోస్ కు విడాకులు ఇస్తాను. మాది పవిత్రబంధం.. విడాకులు తీసుకున్నాక ఇద్దరం కలసి ఉంటాం అన్నారు.. నేనేమైనా అంటరాని దాన్నా.. నేను తిరుమలకు రావొద్దా..? అని ప్రశ్నించారు హనీ ట్రాప్ లో ఇరుక్కున్న జత్వానికి ప్రోటోకాల్ ఎలా ఇచ్చారు. అని ప్రశ్నించారు దివ్వెల మాధురి..