NTV Telugu Site icon

Seediri Appalaraju: రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులు ధర్నా చేస్తున్నారు..

Applraju

Applraju

Seediri Appalaraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులు ధర్నా చేస్తున్నారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. సహకార డైరీలను మూత వేయాలని టీడీపీ ప్రభుత్వం చూస్తుంది.. అలాగే, చిత్తూరు డైరీ మూత పడటానికి చంద్రబాబే కారణం అని ఆరోపించారు. మాక్స్ యాక్ట్ తో ప్రైవేటు డైరీలను సొంత వ్యక్తులకు కట్టబెట్టారు.. ఇంత జరుగుతున్నా మంత్రి అచ్చెన్నాయుడు స్పందించడం లేదు అని ఆయన మండిపడ్డారు. పశు సంవర్థక శాఖ మంత్రిని పశువు అని నేను మాట్లాడను.. ఆవులు అమ్మెయ్యాల అనే దానిపై ఒకసారి చర్చించండి అని పేర్కొన్నారు. కేబినెట్ లో కేసులు ఎవరిపై పెట్టలో అనే దానిపై చర్చిస్తారు తప్ప.. పది మంది రైతులకు మంచి చేద్దాం అనే దానిపై చర్చించడం లేదు అని సీదిరి అప్పలరాజు అన్నారు.

Read Also: SSMB-29: వీడియో లీక్.. రాజమౌళి గురి తప్పుతోందా..?

ఇక, సొంత కంపెనీ లాభాల కోసం మిల్క్ సొసైటీలను నాశనం చేస్తున్నారు అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. డైరీ ఫాం రైతులకు అన్యాయం చేయొద్దని పేర్కొన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి అని డిమాండ్ చేశారు. ప్రైవేట్ డైరీల అరాచకం నడుస్తుంది.. పాడి రైతులు, ఆక్వా రైతులు ఆందోళన చేస్తున్నారు.. అచ్చెన్నాయుడు డిపార్ట్మెంట్ కి తాళం వేసేయండి.. ఎందుకంటే, ఆయనకి దాని మీద అవగాహన లేదనిపిస్తుంది అన్నారు. అచ్చెన్నాయుడుకి నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల ధరలు తగ్గించాలని అచ్చెన్న చెప్పారేమో.. మార్కెట్ లో పాల పాకెట్ ధరలు పెరిగిపోతున్నాయి.. దీంతో దేశంలో అతి పెద్ద డైరీని చంద్రబాబు సంపాదించాలని అనుకుంటున్నారా? అని సీదిరి అప్పల రాజు ప్రశ్నించారు.