NTV Telugu Site icon

CM Chandrababu: టీడీపీ ఎప్పుడు పదవుల కోసం పనిచేయలేదు.. విశ్వసనీయత కోసం పనిచేశాం

Srikakulam

Srikakulam

శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధిపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రంలో మంత్రి పదవులు తీసుకోకుండా రాష్ట్రం కోసం పనిచేసిన పార్టీ టీడీపీ అని అన్నారు. ఇప్పుడు ఎన్డీఏతో కలిసి పనిచేస్తున్నాం.. టీడీపీ ఎప్పుడు పదవుల కోసం పనిచేయలేదు.. విశ్వసనీయత కోసం పని చేస్తాం అనేది గుర్తించాలన్నారు. ప్రజలలో ఉండే ఎక్స్‌ప్టేకేషన్స్‌ను మనం ఫుల్ ఫీల్ చేయాలన్నారు. కీలకమైన సమయంలో 21 మంది ఎంపీలు గెలిపించి కేంద్రంలో మన పరపతి పెంచారని సీఎం తెలిపారు. దానివల్లే అమరావతికి, పోలవరానికి నిధులు ఇచ్చారన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకూడదంటే దానికి నిధులు ఇచ్చారని ముఖ్యమంత్రి పేర్కన్నారు.

Rohit Bal: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ కన్నుమూత

ఎకానమీ పెరిగినప్పుడు పార్టీ శ్రేణులు కూడా రాజకీయంగా ఎకనామిక్ పరంగా ఏవిధంగా ఎదగాలో ఆలోచించాలని సీఎం చంద్రబాబు అధికారులకు తెలిపారు. జగన్ లాంటి వారు రాజకీయాల్లోనే ఎకానమీ సంపాదించుకోవాలని అనుకుంటారు.. తాత్కాలిక ప్రలోభాలకు కాకుండా శాశ్వత గౌరవాన్ని పెంచుకునేందుకు ఆలోచించండి.. మెంబర్షిప్ కార్యక్రమంలో మీ రిఫరెన్స్‌తో కొత్తవారిని చేరిస్తే రేపు ఇచ్చే పదవుల్లో మీకు గుర్తింపు ఇస్తామని చంద్రబాబుకు అధికారులకు చెప్పారు. రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని డిస్టబెన్స్‌లు వస్తున్నాయన్నారు. పాలిటిక్స్‌లో మిత్ర ధర్మం కూడా ఉంటుంది.. జనసేన, బీజేపీని కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత మీపైన ఆయా పార్టీల నేతలపైన ఉంటుందని వ్యాఖ్యానించారు. అందరం కలిసి ఉండాల్సింది చారిత్రిక అవసరం.. ప్రతిపక్షానికి 11 సీట్లు వచ్చాయి. ఆ పార్టీ లేదు అనుకుంటే మనకు ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.

Indonesia: గూగుల్ పిక్సెల్ ఫోన్లపై నిషేధం విధించిన ఇండోనేషియా

అల్టిమేట్‌గా మనం గుర్తించాల్సింది పార్టీనీ కాదు.. ప్రజలతో మనం అనుసంధానం కావాలన్నారు. పదవుల్లో ప్రతి సెలక్షన్ తన ఆలోచన లేకుండా చేయటం లేదు.. ఎందుకంటే మీకు న్యాయం చేయాల్సిన అవసరం తనకు ఉందని చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లు ఉన్నది ఒక రాజకీయ పార్టీ కాదు.. ఐదేళ్లు ఒక నేరస్తుల అడ్డా అది అని దుయ్యబట్టారు. ఆ నేరస్తులు అంత ఈజీగా మారేవారు కాదు రాజకీయ ముసుగులో వాళ్ళు ఉన్నారని అన్నారు. ఈరోజు వీళ్లంతా రాజకీయ నాయకులుగా వచ్చి కొత్తగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని క్యారెక్టర్ అనాలిసిస్‌ను కూడా చేస్తున్నారు.. తాను కక్ష సాధింపులు చేయను కానీ అదే సమయంలో రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుల్ని మాత్రం వదిలే సమస్య లేదని చంద్రబాబు హెచ్చరించారు. తాను చాలా కఠినంగా ఉంటాను.. తాను ఏ పని చేసిన ప్రజాహితం కోసమే చేస్తానని సీఎం చెప్పారు. ఇక నుండి అన్ని జిల్లాల్లో కూడా పార్టీ క్యాడర్‌ను కలుస్తా.. నరేగా పనుల్లో బిల్లులు అడ్డుకున్నారు.. వాటిని పరిష్కరించేందుకు జిల్లాకు ఒక ప్రత్యేక సెల్ పెడతామని సీఎం తెలిపారు.

Show comments