Site icon NTV Telugu

Puttaparthi: మాకు మంచి ఫుడ్‌ పెట్టడం లేదు..! ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసిన విద్యార్థులు

Mla Sindhura Reddy

Mla Sindhura Reddy

Puttaparthi: ప్రభుత్వ స్కూళ్లతో మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పేరుతో మెనూ మార్పుచేసి సన్నబియ్యం అందించేలా చర్యలు తీసుకుంటుది.. గతంలో ఉన్న మెనూను మార్చి.. విద్యార్థులకు పోషకాహారం అందేలా చూడాలని ఆదేశించింది ప్రభుత్వం.. అయితే, మాకు స్కూల్‌లో పెట్టే ఫుడ్‌ బాగోలేదంటూ.. ఏకంగా ఎమ్మెల్యేకే ఫిర్యాదు చేశారు విద్యార్థులు.. దీంతో, రంగంలోకి దిగిన ఎమ్మెల్యే, ఆ పాఠశాలను విజిట్‌ చేసి.. ఆహారాన్ని పరిశీలించి.. ఆగ్రహం వ్యక్తం చేశారు..

Read Also: Delhi: అక్రమ మత మార్పిడి ముఠా గుట్టురట్టు.. అనేక రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌.. హిందూ యువతులే టార్గెట్..!

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే సింధూరరెడ్డికి ఓ ఫోన్‌ వచ్చింది.. మాకు వడ్డించే అన్నం, కూర బాగాలేదని విద్యార్థులు నేరుగాఎమ్మెల్యే సింధూర రెడ్డికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు.. ఇక, ఫోన్ కాల్ తో స్పందించి ఎమ్మెల్యే సింధూరరెడ్డి.. పాముదుర్తి పాఠశాలలను విజిట్‌ చేశారు.. పాముదుర్తి ప్రాథమిక, హై స్కూల్ లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు.. నాణ్యతలేని ఫుడ్‌ సరఫరాపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే.. మరోవైపు.. క్లాసులను పరిశీలించి.. విద్యార్థులను చెబుతున్న పాఠాలపై ఆరా తీశారు.. ఈ సందర్భంగా ఓ క్లాస్‌లో బ్లాక్‌ బోర్డుపై ఎమ్మెల్యే సింధూరరెడ్డి.. నెమలి బొమ్మ వేయగా.. విద్యార్థులంతా చప్పట్లు కొట్టి అభినందించారు..

Exit mobile version