Site icon NTV Telugu

Sri Sathya Sai: సత్యసాయి జిల్లా వైసీపీలో నిరసన గళం.. రోడ్డెక్కిన మద్దతుదారులు

Ycp Nirasana

Ycp Nirasana

Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ అధిష్టానం చేపట్టిన మార్పులు, చేర్పులు ఎఫెక్ట్ స్పష్టంగా కనబడుతోంది. సిట్టింగ్ లను మార్చొందంటూ ఎమ్మెల్యేల మద్దతుదారులు రోడ్డెక్కి తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.

Read Also: MLA Parthasarathy: 29 వేల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాము

వైసీపీ అధిష్టానం నిర్ణయం మేరకు పెనుకొండలో బాధ్యతలు చేపడుతానని మంత్రి ఉషశ్రీ వ్యాఖ్యలు చేసిన వెంటనే శంకరనారాయణ మద్దతుదారులు నిరసన గళం వినిపిస్తున్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి శంకర్ నారాయణకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. శంకరన్న ముద్దు.. బయట వ్యక్తులు వద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.

Read Also: Mansukh Mandavia: విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి పర్యటన

మరోవైపు కదిరి నియోజకవర్గం సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికే కేటాయించాలంటూ మద్దతుదారులు రోడ్డెక్కి నినాదాలు చేశారు. మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు సమావేశాన్ని ఏర్పాటు చేసి సిద్ధారెడ్డికే టిక్కెట్ ఇవ్వాలని.. లేకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు.

Exit mobile version