Fake Video on Pension: సోషల్ మీడియాలో వచ్చే వీడియోల్లో ఏది నిజమే తెలియని పరిస్థితి ఏర్పడింది.. కొందరు పనిగట్టుకొని.. నేతలపై, ప్రభుత్వాలపై, పార్టీలపై, వ్యక్తులపై తప్పుడు ప్రచారం నిర్వహించేందుకు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వదలడంతో.. విషయం తెలియనివాళ్లు వాటిని వైరల్ చేస్తున్నారు.. అయితే, శ్రీ సత్యసాయి జిల్లాలో కూటమి ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేసిన రమేష్ అలియాస్ మాస్ పుష్పను అరెస్ట్ చేశారు పోలీసులు.. నా మానసిక స్థితి బాగోలేక అలా చెప్పాను.. మద్యం మత్తులో మాట్లాడాను.. మా అమ్మకి వితంతు పెన్షన్ రాలేదని అలా వీడియో చేస్తే అయినా.. పెన్షన్ వస్తుందని తప్పుడు ప్రచారం చేశాను అంటున్నాడు రమేష్.. అంతే కానీ, నాకు చంద్రబాబు మీద , పవన్ కల్యాణ్ పై ఎలాంటి కక్ష లేదంటున్నాడు..
Read Also: Viral Video: ‘నాకు చావడం తప్ప వేరే మార్గం లేదు…’ మాజీ సీఎం మేనల్లుడి వీడియో వైరల్..
బుక్కపట్నం మండలం నార్సింపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త అయిన పల్లెల రమేష్.. కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు.. పెన్షన్ రద్దు చేశారంటూ కూటమి ప్రభుత్వంపై ఫేక్ వీడియో చేశాడు.. రెండు చేతులు సక్రమంగా ఉన్నప్పటికీ తాను వికలాంగుడిని అంటూ వీడియోలో తప్పుడు ప్రచారం చేశాడు.. చంద్రబాబు నాయుడుకు ఓటు వేసినందుకు పెన్షన్ రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.. అయితే, వీడియో వైరల్ కావడంతో టీడీపీ నేతలు జిల్లా ఎస్పీ రత్నాకు ఫిర్యాదు చేశారు.. ఎస్పీ ఆదేశాల రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు బుక్కపట్నం పోలీసులు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసినందుకు కేసు నమోదు చేశారు.. భవిష్యత్తులో ఫేక్ పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. అయితే, నాకు మానసిక పరిస్థితి బాగోలేదు, మందు తాగి వీడియో చేశా అని మీడియా ముందు ఒప్పుకున్నాడు రమేష్.
