Andhra Pradesh: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంకు చెందిన నూర్ మహమ్మద్ పై ఉపా యాక్ట్ తో పాటు దేశద్రోహం కేసు నమోదు అయింది. ఇవాళ రాత్రికి కదిరి కోర్టులో నూరు మహమ్మద్ ను పోలీసులు ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, జేషే మహమ్మద్ సంస్థకు సంబంధించిన దాదాపు 29 ఉగ్రవాద సంస్థల గ్రూపుల్లో నూర్ కీలక సభ్యుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, నూర్ మహమ్మద్ కు చెందిన సెల్ ఫోన్ లోనీ డేటాను క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నట్లు తెలుస్తుంది. భారతదేశంలో ముస్లీం యువతను ఉగ్రవాదం వైపు మళ్లీంచే విధంగా నూర్ మహమ్మద్ ప్రేరేపించినట్లు పోలీసులు గుర్తించారు.
Read Also: shocking incident: నాగరాజును నమిలేసిన తొమ్మిది నెలల చిన్నారి..
అయితే, నూర్ మహమ్మద్ ఇంట్లో సోదాలు చేసి పోలీసులు 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జైషే మహ్మద్ సంస్థతో నూర్ మహమ్మద్ కు ఉన్న సంబంధాలు.. జైషే మహ్మద్ సంస్థకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉండటంతో మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేలా వాట్సాప్ గ్రూపుల్లో నూర్ వ్యాఖ్యలు చేసినట్లు తేలింది.