shocking incident: పామును బొమ్మగా భావించి పళ్లతో నమిలేసిందో చిన్నారి. ఈ షాకింగ్ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో వెలుగులోకి చూసింది. పరాప పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కోయ్నార్ గ్రామానికి చెందిన 9 నెలల చిన్నారి బాలిక అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి సమీపంలోకి ఓ విషపూరిత పాము వచ్చింది. దానిని ఆ చిన్నారి ఓ బొమ్మగా భావించి దానితో ఆడుకుంటూ ఒక్కసారిగా పళ్లతో పామును కొరికేసింది. తర్వాత ఏం జరిగింది.. పాము బతికే ఉందా, చిన్నారికి ఏమైనా ప్రమాదం సంభవించిందా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ MORE: Kurnool : ఉల్లిపంట రైతులకు మళ్లీ నిరాశే మిగిలింది.
లిటిల్ లయన్.. మాన్వి
కోయ్నార్ గ్రామానికి చెందిన 9 నెలల చిన్నారి మాన్వి. ఆగస్టు 13న మాన్వి ఇంట్లో ఆడుకుంటోంది. మాన్వి తల్లి దీపిక అనారోగ్యంతో బాధపడుతూ గదిలో విశ్రాంతి తీసుకుంటుంది. మిగిలిన కుటుంబ సభ్యులందరూ వారివారి పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో ఆడుకుంటున్న మాన్వి దగ్గరకు ఒక విషపూరిత పాము వచ్చింది. సాధారణంగా పామును చూస్తే అందరూ భయపడి పారిపోతుంటారు. కానీ ఆ 9 నెలల చిన్నారికి వాస్తవంగా భయం అంటే ఏమిటో తెలియదు. ఆ విషపూరితమైన పామును కూడా ఒక ఆట బొమ్మగా భావించి దానిని నోట్లో పెట్టుకొని నమలడం ప్రారంభించింది. దీంతో ఆ పాము చనిపోయింది. కొంత సమయం తర్వాత చిన్నపాప ఏం చేస్తుందో చూద్దామని వచ్చిన తల్లి దీపిక లోపల ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది.
దీపిక తన కూతురు పాము నమలడం చూసి భయపడిపోయి వెంటనే పామును లాక్కొని దూరంగా విసిరేసింది. బిడ్డకు ఏదైనా జరిగిందేమో అనే భయంతో బయటకు పరుగులు తీసి కుటుంబ సభ్యులకు విషయం చెప్పి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. విషయం విన్న వెంటనే ముందుగా కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. తర్వాత స్థానికంగా ఉన్న లేక్ జగదల్పూర్‌లోని మెకాజా ఆస్పత్రికి చిన్నారిని తీసుకెళ్లి చూపించారు.
వైద్యులు బాలికను పరీక్షించి 24 గంటల పర్యవేక్షణలో ఉంచారు. తర్వాత మాన్వి పూర్తిగా క్షేమంగా ధ్రువీకరించారు. ఆ తర్వాత మరుసటి రోజు చిన్నారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. బాలిక పామును నోట్లో పెట్టుకొని నమలడం ప్రారంభించిన కొన్ని క్షణాల్లోనే చనిపోయి ఉండాలని అన్నారు. ఈ విషయం గ్రామస్థులందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మాన్విని అక్కడివారందరూ ‘చిన్న సింహరాశి’ అని ముద్దుగా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
READ MORE: Delhi gangster suicide: ఢిల్లీ జైలులో గ్యాంగ్‌స్టర్ సూసైడ్.. జైలు నంబర్ 15లో ఏం జరిగింది?