Nandamuri Balakrishna: తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం వేదికగా ప్రత్యర్థులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రకమాల్లో మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో కలిసి పాల్గొన్న బాలకృష్ణ.. టేకులోడులోని ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.. ఇందిరమ్మ కాలనీలో గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలకు స్వాధీన పత్రాలను మంత్రి అనగానితో కలిసి పంపిణీ చేశారు.. మొత్తం 237 మంది లబ్దిదారులకు స్వాధీన పత్రాలు అందజేశారు.. ఇక, ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Kishan Reddy: కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రైల్వే కనెక్టివిటీ అభివృద్ధి చేయబడింది..
ఇక, స్వర్గీయ ఎన్టీఆర్ కు హిందూపురం అంటే రెండో పుట్టినిల్లుగా భావించేవారు అని గుర్తుచేశారు నందమూరి బాలకృష్ణ.. టీడీపీ అంటే ఒక జవాబుదారి పార్టీగా పేరుగాంచింది.. రాయలసీమ గడ్డ.. నా అడ్డా.. అని పేర్కొన్నారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న లీడర్ అని ప్రశంసించారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే హిందూపురంలో 50 కోట్ల రూపాయల నిధులతోపనులు చేయించాను అని వెల్లడించారు.. హిందూపురంలో శాశ్వత తాగునీటి పథకానికి 136 కోట్ల రూపాయలు నివేదికలు సిద్ధం చేశాం.. మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరుస్తామని తెలిపారు.. 1984లోనే స్వర్గీయ ఎన్టీఆర్ తూముకుంట వద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడం పురం ప్రజలు మర్చి పోలేనిది అని గుర్తుచేశారు సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..
