తెలంగాణ, కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లిన డబ్బు సంచులు మహారాష్ట్ర ఎన్నికల్లో పనిచేయలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. మహాయుతి కూటమి అభివృద్ధి మంత్రాలకే మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా.. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ను ప్రజలు చీదరించుకున్నారని అన్నారు. అబద్దపు ప్రచారం చేసిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహించి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఒక్క బీజేపీ కూటమి మాత్రమేనని మంత్రి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, పింఛన్లు అందజేస్తున్నామన్నారు. తమపై విశ్వాసంతో మహారాష్ట్రలో ముచ్చటగా మూడోసారి ప్రజలు అధికారం ఇచ్చారని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
Read Also: Skin Care Tips: చలికాలంలో చర్మం పొడిబారుతుంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ సంచలన విజయం సాధించింది. దిశగా పరుగెడుతోంది. మొత్తం 288 స్థానాల్లో 231 చోట్ల లీడింగ్‌లో ఉంది. ఇది మ్యాజిక్ ఫిగర్ 145 కంటే చాలా ఎక్కువ. మరోవైపు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) 50 సీట్లకే పరిమితయ్యేలా కనిపిస్తోంది. మరోసారి మహారాష్ట్రలో బీజేపీ అధికారాన్ని చేపట్టబోతోంది.
Read Also: INDIA Bloc: 6 నెలల్లో ఎంత మార్పు.. లోక్‌సభలో అదుర్స్.. అసెంబ్లీలో తుస్!