Kethireddy Venkatarami Reddy: సీఎం చంద్రబాబుపై సెటైరికల్ కామెంట్లు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంట్రామిరెడ్డి.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చాడంటే విచిత్రమైన వాతావరణం ఉంటుందన్న ఆయన.. ఆయన వళ్లే.. ఎండకాలంలో వర్షాలు, వర్షాకాలంలో వర్షాభావం ఉందని ఎద్దేవా చేశారు.. ఈ భిన్నమైన వాతావరణం కారణంగా.. ఒక్క పంట రైతులు వేయలేకపోతున్నారు.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పంట పెడితే నాశనమే అంటూ హాట్ కామెంట్లు చేశారు..
Read Also: Health News: సమోసా, జిలేబీలకు కూడా ఇకపై “సిగరేట్-తరహా” వార్నింగ్స్..
ఇక, చంద్రబాబు హయాంలో ప్రతిదీ గిన్నీస్ బుక్కు రికార్డులే ఉంటాయి అని విమర్శించారు కేతిరెడ్డి.. మేం చేసింది చెప్పుకోలేకపోయాం.. చంద్రబాబు మోసాలు చెప్పలేకపోయాం అన్నారు. అయితే, వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని తెలిపారు.. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. జనం భారీగా తరలివస్తున్నారని గుర్తుచేశారు.. అయితే, జగన్‌ని ఆపేందుకు 2వేల మంది పోలీసులు ఎందుకు..? అని ప్రశ్నించారు.. మరోవైపు, ఆగష్టు నుంచి ఫ్రీ బస్సు ఉంటుందని మహిళలు సంబరపడిపోతున్నారు.. అలా అని బస్సు ఎక్కితే మధ్యలోనే దింపేసి పోతారు అంటూ ఆరోపణలు గుప్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంట్రామిరెడ్డి.
