Chandrababu and Lokesh: ఉపాధ్యాయుడిగా మారిన సీఎం చంద్రబాబు.. విద్యార్థిగా లోకేష్..
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెగా పేరెంట్-టీచర్ మీటింగ్..
- కొత్తచెరువు స్కూల్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, లోకేష్..
- ఉపాధ్యాయుడిగా మారారు ముఖ్యమంత్రి చంద్రబాబు..
- పీటీఎంలో భాగంగా విద్యార్థులకు విద్యా బోధన..
- విద్యార్థులతో కలిసి పాఠాలు విన్న మంత్రి లోకేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu and Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహిస్తోంది.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కార్యక్రమం జరుగుతోంది.. పాఠశాల విద్యలో తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల సహకారంపై చర్చతో పాటు.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్.. డ్రగ్ ఎడిక్షన్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. ఇక, గిన్నిస్ బుక్ రికార్డు దిశగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతోంది.. 2 కోట్లకు పైగా భాగస్వామ్యంతో పేరెంట్ – టీచర్ మీటింగ్ జరుగుతుంగా.. 74 లక్షలకు పైగా విద్యార్థులు పాల్గొంటున్నారని చెబుతున్నారు.. అయితే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు.. ఒక్క సారిగా ఉపాధ్యాయుడిగా మారిపోయి.. విద్యార్థులకు పాఠాలు భోదించారు.. ఇదే సమయంలో.. విద్యార్థిగా మారిపోయిన మంత్రి నారా లోకేష్.. విద్యార్థుల మధ్యే కూర్చొని ఆ క్లాస్ విన్నారు..
Read Also: Nakrekal: నా కోడికి న్యాయం కావాలి.. పోలీస్ స్టేషన్ చేరిన పంచాయతి..!
Also Read
- Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు గ్రామంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్.. అయితే, ఉపాధ్యాయుడిగా మారారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. పీటీఎం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విద్యా బోధన చేశారు.. వనరుల అనే సబ్జెక్ట్ పై విద్యార్థులకు క్లాస్ తీసుకున్నారు.. అయితే, విద్యార్థులతో కలిసి పాఠాలు విన్నారు మంత్రి నారా లోకేష్.. ఆ తర్వాత విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి.. మార్కులపై ఆరా తీశారు సీఎం.. తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఫొటోలు దిగారు సీఎం చంద్రబాబు.. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు.. ఈ మార్పులన్నింటినీ తీసుకొచ్చినందుకు మంత్రి లోకేష్‌పై ప్రసంశలు కురిపించారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!