Site icon NTV Telugu

MLA Balakrishna: హిందూపురంలో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మెకు బాలకృష్ణ మద్దతు..

Balaiah

Balaiah

MLA Balakrishna: ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులు 14 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. పురపాలక సంఘాల్లోని పారిశుద్ధ్య కార్మికులు, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ సిబ్బంది తమ డిమాండ్ల సాధన కోసం రెండు వారాలుగా పోరాటం సాగిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ.. సఫలం కాలేదు. దీంతో సమ్మె కొనసాగిస్తామని మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అయితే.. ఈరోజు హిందూపురంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న శిబిరానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెళ్లారు. మున్సిపల్ కార్మికుల సమ్మెలో పాల్గొని.. వారికి మద్దతు తెలిపారు. తమను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ కార్మికులు బాలయ్య దృష్టికి తీసుకెళ్లారు.

Read Also: Gorantla Butchaiah: అక్కడ పనికిరాడు కానీ.. ఇక్కడ పోటీకి పనికొస్తాడా..? బుచ్చయ్య సంచలన వ్యాఖ్యలు..

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. చివరకు ప్రజలే బుద్ధి చెబుతారని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజలు విసిగి చెందారని దుయ్యబట్టారు. కష్టపడి పని చేస్తున్న కార్మికుల సమస్య తీర్చాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని అన్నారు. వైసీపీ పాలనలో ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. మూడు నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుంది.. అన్ని విధాలుగా కార్మికులను ఆదుకుంటామని బాలకృష్ణ తెలిపారు.

Read Also: IND vs AFG: కోహ్లీ, రోహిత్‌ రీఎంట్రీ అవసరమా?.. వారి పరిస్థితి ఏంటి?

Exit mobile version