Thopudurthi Prakash Reddy: శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలం పాపిరెడ్డి గ్రామ సమీపంలో హెలిప్యాడ్ దగ్గర జరిగిన ఘటనలో కీలక వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హెలిప్యాడ్ వద్ద పోలీసులపై దాడి ఘటనలో కీలకంగా వ్యవహరించిన చెన్నె కొత్తపల్లి, రామగిరి మండలాలకు చెందిన 11 మంది వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను అరెస్ట్ చేశారు. హెలిప్యాడ్ దగ్గర పోలీసులపై దాడికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో పాల్గొన్న మరికొంత మంది వైసీపీ నేతల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Also: Sridevi : నా మూవీ థియేటర్‌లో చూడడానికి.. శ్రీదేవీ బుర్ఖాలో వెళ్ళింది
అయితే, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన సోదరుడు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. కాగా, తోపుదుర్తి బ్రదర్స్ హైదరాబాద్లో ఉన్నట్లు సమాచారం వచ్చింది. దీంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కోసం హైదరాబాద్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ బృందాలు వెళ్లనున్నారు. తోపుదుర్తి బ్రదర్స్ దొరికితే అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
