Site icon NTV Telugu

YS Jagan Nellore Tour: నెల్లూరు చేరుకున్న జగన్‌.. హరిత హోటల్‌ దగ్గర ఉద్రిక్తత..

Jagan

Jagan

YS Jagan Nellore Tour: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నెల్లూరు చేరుకున్నారు.. హెలిప్యాడ్‌ వద్ద వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికారు వైసీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు.. ఇక, నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డిని మొదట పరామర్శించనున్న జగన్.. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు.. అయితే, జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన నేపథ్యంలో ఏపీ టూరిజం హరిత హోటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని స్వాగతించేందుకు.. మెయిన్ రోడ్డుపైకి వచ్చారు ప్రసన్నకుమార్ రెడ్డి.. వందలాది ప్రజలతో వచ్చిన ప్రసన్నను అడ్డుకున్నారు పోలీసులు.. జై జగన్.. జై ప్రసన్న కుమార్ రెడ్డి.. జగన్‌, ప్రసన్న నాయకత్వం వర్ధిల్లాలి.. అంటూ నినాదాలతో హోరెత్తించారు యువకులు. దీంతో, ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది.. అప్రమత్తమైన పోలీసులు, వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు.. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించారు.. అయితే, నెల్లూరు చేరుకున్న జగన్‌..

Read Also: Mrunal Thakur : ‘డెకాయిట్’ టీమ్ ప్లాన్ అదుర్స్.. మృణాల్‌కు ఎమోషనల్ సర్‌ప్రైజ్

నెల్లూరు సెంట్రల్‌ జైలు వద్దకు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించడానికి వెళ్తుండగా.. హరిత హోటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో.. పోలీసులు అలర్ట్‌ అయ్యారు.. నల్లపురెడ్డి కుమార్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో.. కార్యకర్తలు దూసుకురాగా.. వైసీపీ కార్యకర్తల మీద లాఠిఛార్జ్‌ చేశారు పోలీసులు.. దీంతో, రోడ్డుమీద బైఠాయించారు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. తనతో సహా వైసీపీ శ్రేణులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై నిరసనకు దిగారు.. రోడ్డుపై పోలీసుల ఆదేశాల ప్రకారమే తాము నడుచుకున్నా పోలీసులు లాఠీఛార్జ్ చేశారంటూ ప్రసన్న కుమార్ రెడ్డి ఫైర్‌ అయ్యారు.. ఎస్పీ వచ్చి క్షమాపణ చెప్పే వరకు రోడ్డుపై నుంచి లేచేది లేదంటూ బైఠాయించారు.. తమ అధినేత జగన్ వచ్చేవరకు నిరసన కొనసాగిస్తామంటున్న ప్రసన్న కుమార్ రెడ్డి.. పోలీసుల వైఖరి సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు..

Exit mobile version