Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు స్టార్ట్ చేశారు.. దాని పర్యవసానం భయంకరంగా ఉంటుంది..!

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు స్టార్ట్ చేశారు.. దాని పర్యవసానం భవిష్యత్తులో భయంకరంగా ఉంటుందంటూ కామెంట్ చేశారు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పీఏసీ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి.. నెల్లూరు సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై వరుస పెట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.. కల్పిత కథనాలు సృష్టించి.. ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాణి మీద కేసులు పెట్టి జైలుకు పంపారు.. తప్పుడు కేసులు పరాకాష్టకి చేరాయి.. అక్రమంగా అరెస్ట్ చేస్తే.. వారు బయటికి వచ్చిన తరువాత మరింత రాటు తెలుతున్నారు.. చంద్రబాబు స్టార్ట్ చేశారు.. దాని పర్యావశనం భవిష్యత్తు లో భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు..

Read Also: Covid-19: భారత్‌లో భారీగా పెరిగిన కోవిడ్‌ కేసులు, ఏడుగురు మృతి

పోలీసులు.. తెనాలిలో ముగ్గురుని దారుణంగా కొట్టారు.. రాష్టంలో సిస్టమ్ ఫెయిలు ఐపోయింది.. పబ్లిక్ గానే బట్టలు లేకుండా డాన్సులు వేపిస్తున్నారని దుయ్యబట్టారు సజ్జల.. ఎంత అణగతొక్కాలని చూస్తే.. అంతే బలంగా వైస్సార్సీపీ పైకి లేస్తుందన్న ఆయన.. వైస్సార్సీపీలో ఉండే సీనియర్ నేతలను టార్గెట్ చేస్తారని మేం ముందే అనుకున్నాం.. చంద్రబాబుకి రాజకీయ ఉనికి లేకుండా చెయ్యాలని రాష్ట్ర ప్రజలు సిద్దమయ్యారని వ్యాఖ్యానించారు.. చంద్రబాబులో మార్పు వస్తే మేలు.. రాకపోతే భవిష్యత్తు భయంకరంగా ఉంటుందన్నారు.. అసలు వైఎస్‌ జగన్ అనుకుని ఉంటే.. చంద్రబాబుని మరోసారి జైలుకు పంపేవారని.. అయనపై అనేక కేసులు ఉన్నాయన్నారు.. లిక్కర్ కేసులో బెయిల్ మీద చంద్రబాబు.. వాటిని మేనేజ్ చేసుకుంటున్నాడు అని ఆరోపించారు.. అయితే, కేసులు భయపడేది లేదు.. అన్నిటికి సిద్దపడే రాజకీయాల్లోకి వచ్చామని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి..

Exit mobile version