Site icon NTV Telugu

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణికి మళ్లీ నోటీసులు.. సిద్ధమైన పోలీసులు

Kakani

Kakani

Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ లో అక్రమ తవ్వకాలు.. ఖనిజం రవాణా.. పేలుడు పదార్థాల నిల్వకు సంబంధించి వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదైన కేసుకు సంబంధించి మూడో సారి నోటీసులు ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు. నెల్లూరుకు కాకాణి చేరుకున్న వెంటనే స్వయంగా ఆయనకే నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని కాకాణికి ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. అయితే, విచారణకు హాజరు కాకపోవడంతో.. తదుపరి కార్యాచరణ కు సంబంధించి నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులు సమావేశమై చర్చిస్తున్నారు.

Read Also: Raghunandan Rao : రాహుల్ గాంధీకి HCU కనిపించడం లేదా

కాగా, తెల్ల రాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలు చేపట్టకుండా మద్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ఏపీ హైకోర్టు మంగళవారం స్పష్టం చేసిన విషయం విదితమే.. ఈ కేసులో కాకాణి ఏ 4గా ఉన్నారు.. పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇచ్చినా.. కాకాణి సహకరించటం లేదని ప్రభుత్వం.. హైకోర్టుకి తెలియజేసింది.. ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేసినట్టు కోర్టులో మెమో ఫైల్ చేసింది.. అయితే, హైదరాబాద్ లో ఉన్న కారణంగా పోలీసు విచారణకు హాజరు కాలేకపోయారని కాకాణి తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు.. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించిన న్యాయస్థానం.. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసిన విషయం విదితమే.. అయితే, పోలీసులు రెండో నోటీసులు జారీ చేసిన.. వరుసగా రెండో రోజూ కూడా పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ముందస్తు బెయిల్‌ కోసం.. మరోవైపు.. కేసు క్వాష్‌ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. కాకాణిపై తొందరు పాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది ఏపీ హైకోర్టు..

Exit mobile version