YSRCP: నెల్లూరు జిల్లాలో వైసీపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారని నవాబ్ పేట పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏ కేసులో వారిని అరెస్ట్ చేశారో చెప్పాలని పోలీసులను మాజీ మంత్రి అనిల్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కోరారు.
Read Also: Quinton de Kock History: క్వింటన్ డికాక్ సరికొత్త చరిత్ర.. టీమిండియాపైనే అత్యధికసార్లు..!
ఈ సందర్భంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వైసీపీకి, మేయర్ స్రవంతికి సంబంధం లేదు.. వైఎస్ జగన్ ను కలిసిన వెంటనే ఇద్దరు కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.. టీడీపీ విధానాలు నచ్చక తిరిగి వైసీపీ గూటికి వచ్చిన కార్పొరేటర్స్ ను ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది అని ఆరోపించారు. మా పార్టీ గుర్తు మీద గెలిచిన వారిని మీ పార్టీలోకి లాక్కోవడం దారుణమని మాజీ మంత్రి అనిల్ అన్నారు.
Read Also: Sleep Jerks: గాఢ నిద్రలో ఉండగా ఉలిక్కి పడి లేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
ఇక, కార్పొరేటర్లను మేము బెదిరించి, ప్రలోభాలకు గురి చేస్తున్నామని విమర్శలు చేయడం దారుణం అని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఐదుగురు వైసీపీలో చేరితే టీడీపీ ఎందుకు బయపడుతుందో అర్థం కావడం లేదని విమర్శించారు. మమల్ని చూసి.. టీడీపీ నేతలు భయపడుతున్నారు.. అందుకే కార్పొరేటర్లను క్యాంప్ లకు తీసుకెళ్లారు.. ఇక, వైసీపీలోకి వచ్చిన వారి మీద ఏ కేసులు పెట్టారో కూడా చెప్పడం లేదు.. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అనిల్ కుమార్ మండిపడ్డారు.
