Nedurumalli Ram Kumar: చంద్రబాబును అరెస్ట్ చేయడం సబబే.. స్కీం ను స్కాం గా మార్చారని వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. సిమెన్స్ కంపెనీతో ఒప్పందం అంటే నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాలు వస్తాయని భావిస్తారు. కానీ సిమెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుని.. రూ.370 కోట్లను ప్రభుత్వ వాటా కింద మూడు నెలల్లో విడుదల చేసారని తెలిపారు. ఇది నిబంధనల ప్రకారం చేయలేదని ఆర్థిక శాఖ కూడా అభ్యంతరం తెలిపిందని నేదురుమల్లి అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలతో నిధులు విడుదల చేసినట్లు నోట్ ఫైల్ లో రాశారని.. షెల్ కంపెనీల ద్వారా ఎవరికి చేరాలో వారికి ముడుపులు చేరాయని పేర్కొన్నారు.
Read Also: G20 Summit: జీ20లో కీలక పరిణామం.. ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం
ఈ స్కాం అప్పుడే బయటకు వచ్చిందని.. కానీ అప్పట్లో తొక్కి పెట్టారని విమర్శించారు. మేము అవినీతికి అతీతులమని చెప్పే టీడీపీ నేతలు.. ఇప్పుడేమంటారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ప్రొసీజర్ ప్రకారం నోటీసులు ఇచ్చారని.. తప్పు చేసిన వ్యక్తిని ప్రశ్నించేందుకు అరెస్ట్ చేశారని నేదురుమల్లి అన్నారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగపరిస్తే.. చర్యలు తీసుకోకూడదా అని అన్నారు. ఈ స్కాంకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయని.. చంద్రబాబు అరెస్ట్ లో ప్రభుత్వ పాత్ర లేదని తెలిపారు. సీఐడీ తన పని తాను చేసిందని.. తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులేనని నేదురుమల్లి చెప్పారు.
Read Also: Nadendla Manohar: పవన్ కల్యాణ్ వస్తుంటే ఎందుకు భయపడుతున్నారు