కోవూరులో వైసీపీ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయన్నారు. ‘సి’ ఓటర్ సర్వేలో మాత్రం చంద్రబాబు అధికారంలోకి వస్తారని చెబుతోందని తెలిపారు. సి ఓటర్ సర్వే చంద్రబాబు చెంచా లాంటిదని దుయ్యబట్టారు.
Read Also: Janga Krishnamurthy: మాజీ మంత్రి అనిల్ మాటలు తగ్గించాలి.. ఎమ్మెల్సీ జంగా కీలక వ్యాఖ్యలు
నా సర్వే చెబుతున్నాను.. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే తమకు 117 సీట్లు వస్తాయని తెలిపారు. ఆ ముగ్గురు విడిపోతే 132 సీట్లు వైసీపీకి వస్తాయన్నారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రాసి పెట్టుకోండి ఈ సమావేశంలో నేను చెప్పిందే జరుగుతుందని చెప్పారు. ఎన్ని శక్తులు ఒకటైనా సింహం సింగల్ గా వస్తుందని పేర్కొన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా.. జగన్ వెంట్రుక కూడా పీకలేరని తెలిపారు.
Read Also: Farmers protest: 6 నెలల రేషన్, గురుద్వారాల్లో రహస్య స్థావరాలు.. పక్కా ప్లాన్‌తో రైతుల నిరసన..
ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ మంత్రిగా ఎప్పుడూ తాను వ్యవహరించలేదని అన్నారు. మనమందరూ వైసీపీ కుటుంబ సభ్యులం.. అందరి ఆశీర్వాదం తనకు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి ఎంపీ అభ్యర్థిగా ఎవరిని పెడతారో వారిని కూడా మనం ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ పేర్కొన్నారు.
