NTV Telugu Site icon

Minister Narayana: ఖజానా ఖాళీ.. అన్ని శాఖల్లో అప్పులే..!

Narayana

Narayana

Minister Narayana: గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయడమే కాకుండా.. అప్పులు చేసి పెట్టింది.. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అప్పులే కనిపిస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి పొంగూరు నారాయణ.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ ప్రభుత్వ హయాంలో.. ప్రభుత్వ భవనాలను సైతం తాకట్టు పెట్టిందని విమర్శించారు.. అయితే, రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఆదాయ వనరులు పెరగాలి.. పారిశ్రామికంగా అభివృద్ధి జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.. మున్సిపల్ శాఖలో ప్రజలు కట్టిన పన్నుల డబ్బులన్నిటినీ వాడేశారనా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు మురిగిపోయాయని విమర్శించారు..

Read Also: Tollywood : సినిమా అవకాశాల పేరుతో యువతిపై అసిస్టెంట్ డైరెక్టర్ అత్యాచారం

మరోవైపు.. ఈ రోజు తెల్లవారుజామున నుండే రాష్ట్రంలో 68 లక్షల 64 వేల మందికి పెన్షన్ల పంపిణీ ప్రారంభమైందని వెల్లడించారు మంత్రి నారాయణ.. రూ.3వేల నుండి రూ..4 వేలకు పెంచుతామని ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకున్నారు.. ఇచ్చిన మాటకు అనుగుణంగా.. గత నెలలో ఒకేసారి రూ.7 వేల పెన్షన్‌ పంపిణీ చేశాం.. ఈ నెల నుంచి ప్రతీ నెలా రూ.4 వేల పెన్షన్‌ లబ్ధిదారులకు అందుతుందన్నారు.. ఇక, ఈ నెలాఖరుకు 203 అన్నా క్యాంటీన్లను పూర్తిస్థాయిలో పునఃప్రారంభిస్తామని ప్రకటించారు మంత్రి పొంగూరు నారాయణ.