Minister Anam Ramanarayana Reddy: టీటీడీ ఎస్వీ గోశాల వ్యవహారంపై పొలిటికల్ హీట్ పెరిగింది.. పాలక, ప్రతిపక్షాలు సవాళ్లు, ప్రతిసవాళ్లతో తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి ఆనం రామానారాయణరెడ్డి.. వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. టీటీడీని అపవిత్రం చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులను నిర్వీర్యం చేసి.. పాలక మండలిని అవమానకరంగా దూషించాలని తిరుపతి తిరుమలలో అదేపనిగా చేస్తున్నారు. ఏదైనా ఒక మంచి కార్యక్రమం వస్తే దాన్ని అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.. కొత్త కార్యక్రమాలను ఇంకా బాగా చేసేందుకు సలహాలు సూచనలు ఇవ్వడం లేదు.. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు సలహాలు ఇవ్వరు.. కానీ, ఎదో ఒక బురద చల్లి.. వాతావరణాన్ని కలుషితం చేసేందుకే వైసీపీ నేతలు పనిచేస్తున్నారు.. బ్రహ్మోత్సవాల సమయంలో ఒక రకమైన నిందలు వేశారు.. ముక్కోటి ఏకాదశి నాడు మరో రకంగా చేశారు.. ఒంటిమిట్టలో గతంలో ఎన్నడూ లేనంత విధంగా కోదండ రామస్వామి కళ్యాణాన్ని చేస్తుంటే గోశాల గురించి మాట్లాడుతున్నారు.. ఇవన్నీ చూస్తుంటే వైసీపీ నాయకులకు ఈ ప్రభుత్వం మీద నిందలు మోపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది అని మండిపడ్డారు.
సీపీఐ జాతీయ నేత నారాయణ గోశాలను పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.. టిటిడి పాలకవర్గం గోవులను సంరక్షిస్తోందని చెప్పారు.. అయినా వైసీపీ నేతలకు తృప్తి లేదు అన్నారు మంత్రి ఆనం.. ఇవాళ సవాళ్లు విసురుతున్నారు.. ఎక్కడైనా కొన్ని సహజ మరణాలు ఉంటాయి.. వీటిని కూడా పాలకమండలికి భూమన కరుణాకర్ రెడ్డి లాంటి నాస్తికుడు ఆపాదించడం సరికాదు.. ఆయన రెండుసార్లు టిటిడి చైర్మన్ గా చేశారు.. అప్పట్లో టీటీడీ దోపిడీ గురైంది.. అప్పట్లో వందల కోట్ల రూపాయల టీటీడీ నిధులను సి.సి.రోడ్ల కోసం వాడారు.. గోశాలలో నోరులేని జీవాలు ఉన్నాయి. మనందరం నిత్యం కొలిచే జీవి గోవు.. హిందూ సమాజం… హిందూ సంప్రదాయాలు.. సనాతన ధర్మం .. వైదిక పండితుల మీద అసలు కరుణాకర్ రెడ్డికి అవగాహన లేదని ఫైర్ అయ్యారు.. కరుణాకర్ రెడ్డి కుటుంబంలో కూడా ఇతర మతాలకు చెందిన కార్యక్రమాలు చేస్తారు.. ఆ మతం మీద వాళ్ళకి నమ్మకం.. అవగాహన ఉందన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలనూ గౌరవిస్తుంది.. ఒక నాస్తికుడు వచ్చి గోవు గురించి మాట్లాడేందుకు సిగ్గు పడాలి.. గోశాలలో ఎలాంటి తప్పిదం జరగడం లేదు అని స్పష్టం చేశారు.. కరుణాకర్ రెడ్డి హయాంలో టీటీడీలో జరిగిన తప్పిదాల వల్లే వైసీపీ వాళ్లు మట్టి కొట్టుకుపోయారు.. పునాదులు కదిలిపోయాయి.. టీటీడీని దారి దోపిడి దొంగలు లాగా దోచుకున్నారు.. ఏడుకొండలు కాదు రెండు కొండలు అన్నారు వెంకటేశ్వర స్వామిని నల్లబండ అన్నారు.. కరుణాకర్ రెడ్డి నిజమైన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడైతే… తొలిమెట్టు మీద తలవంచి తప్పు చేశానని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి..