Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అంటూ రౌడీ షీటర్ల సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. “ప్రజల కోసం ప్రాణాలు అర్పించే ఉక్కు సంకల్పం నాది.. నా రాజకీయ జీవితం పూల పాన్పు కాదు.. నిత్యం ముళ్ల మీద ప్రయాణం.. ఎన్నో సమ్మెట దెబ్బలు ఓర్చుకున్న ఈ గుండె తాటాకు చప్పుళ్ళకు బెదరదు.. ప్రజా సేవలో వెనక్కు తగ్గదు..” అంటూ ట్వీట్ చేశారు.. ఇక, ఈ వ్యవహారంపై ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రశాంతమైన నెల్లూరులో కొంతమంది రౌడీ షీటర్లు అరాచకాలు చేస్తున్నారు అని దుయ్యబట్టారు.. జులై 1న రౌడీ షీటర్లు కూర్చుని నన్ను చంపాలని మాట్లాడుకున్నారు.. మూడు రోజుల ముందు పోలీసులకు వస్తే.. ఎందుకు నాకు సమాచారం ఇవ్వలేదు..? అని నిలదీశారు.. అసలు, నన్ను చంపితే డబ్బు ఎవరు ఇస్తారనేది పోలీసుల విచారణలో తెలియాలన్నారు..
Read Also: Trump Health: ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన.. రెండు రోజులుగా కనిపించట్లేదని నెట్టింట చర్చ
రాజ్యాధికారం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యులను చంపే సంప్రదాయం మా ఇంట్లో లేదు అని వ్యాఖ్యానించారు కోటంరెడ్డి.. రౌడీ షీటర్లు నా తమ్ముడు గిరిధర్ రెడ్డి అనుచరులు అని ఓ మీడియా రాసిందని మండిపడ్డారు.. విద్యార్ది దశలోనే ఎన్నో పోరాటాలు చేశాను. రౌడీలకు, గుండాలకు భయపడనన్న ఆయన.. వైఎస్ జగన్ ని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి పోరాటం చేశాను.. 16 నెలలు అధికారాన్ని వదులుకుని టీడీపీలో చేరాను. వైస్సార్సీపీకి సవాల్ విసిరుతున్నా.. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. వెనకడుగు వేసిదేలన్నారు.. అసలు, నన్ను చంపితే కోట్లు రూపాయల డబ్బులు ఇస్తామని ఎవరు చెప్పారో పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు. ఇలాంటి బెదిరింపులకు భయపడను.. నన్ను హత్య చేస్తామని మాట్లాడిన గుండాలకు మా ఇంట్లో చిన్న పిల్లలు కూడా భయపడరు.. నా చివరి శ్వాస, ఓపిక, ఊపిరి ఉన్నంత వరకు ప్రజా జీవితంలోనే ఉంటాను అని ప్రకటించారు కోటంరెడ్డి..
Read Also: KCR: అసెంబ్లీ సమావేశాలకు దూరంగా కేసీఆర్..
వైసీపీతో నాకు తీవ్రంగా విబేధాలు ఉన్నాయి.. వాళ్ల సోషల్ మీడియా నా మీద విషం చిమ్ముతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కోటంరెడ్డి.. ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతుంటే.. ఒక్కరికి కూడా నేను నష్టం కల్గించలేదన్న ఆయన.. అసలు, వైస్సార్సీపీ నేతలు నన్ను ఎందుకు గెలుకుతున్నారు..? అని ఫైర్ అయ్యారు.. గత ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి నా గన్‌మెన్‌లను తొలగించారని గుర్తుచేశారు. పోలీసులు ఎక్కడా వైఫల్యం చెందలేదు.. రౌడీయిజంపై ఉక్కుపాదం మోపుతున్నారని పేర్కొన్నారు.. పోలీసులు కఠినంగా వ్యవహరించడం వల్లే నిందితులు జైల్లులో ఉన్నారని తెలిపారు.. ఇక, వీడియోలో మాట్లాడిన ఒకరిద్దరు వ్యక్తులు నాకు తెలుసని పేర్కొన్నారు.. నా హత్యకు ఇచ్చిన సుపారీ ఎంత అనేది పోలీసులే తేల్చాలన్నారు.. హోం మంత్రి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడారు.. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి..
