NTV Telugu Site icon

Kakarla Suresh: టీడీపీ-జనసేన-బీజేపీల కలయిక చారిత్రాత్మకం..

Suresh

Suresh

త్వరలో జరగబోవు ఎన్నికల సంగ్రామంలో తెలుగుదేశం జనసేన టీడీపీల కలయిక చారిత్రాత్మకమైనదని.. మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా నడిచి విజయం సాధిద్దామని ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు. వింజమూరు మండల కేంద్రం బొమ్మరాజు చెరువు తెలుగుదేశం కార్యాలయం నందు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాకర్ల మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో దుష్ట శక్తిని సాగనంపాలంటే అందరి కలయిక ముఖ్యమని ఒక అడుగు ముందుకేసి అనుభవం ఉన్న నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు అందరితో సయోధ్య కుదిర్చి పొత్తు పెట్టుకోవడం శుభ పరిణామం అన్నారు.

తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలను స్వాగతిస్తున్నట్లు కాకర్ల సురేష్ తెలిపారు. వైసీపీ నిరంకుశ పాలన తుది ముట్టించేందుకు అందరూ ఐక్యంగా పోరాటం చేద్దామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మారిందని.. ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. అన్ని వర్గాల పై దాడులు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి అన్నారు. బీసీలకు అన్యాయం చేసిన విషయాన్ని బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి చెప్పిన మాటల్లోనే అర్థమవుతుందన్నారు.

బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు లాంటిదని.. దీనికి నిదర్శనం మొన్న జరిగిన జయహో బీసీ సభ రుజువు చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అంటే కేవలం జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డిగా మారిందన్నారు. తెలుగు ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి మహా యజ్ఞంగా మూడు పార్టీలు కలిసి పనిచేయాలన్నారు. గతంలో ఇంత అరాచక పాలన చూడలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దార్షిణికపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రక్షణగా ఉంటుందని.. అతిపెద్ద జాతీయ పార్టీ మద్దతు ఇవ్వడం శుభ పరిణామం అన్నారు. అందుచేత అందరం కలిసికట్టుగా పనిచేసే విజయం సాధిద్దామని కాకర్ల పిలుపునిచ్చారు. అదేవిధంగా ఉదయగిరి అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థించారు.