Site icon NTV Telugu

YS Jagan Nellore Tour: వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటన.. వైసీపీ నేతలపై మరో కేసు నమోదు..

Jagan

Jagan

One more case on YS Jagan Nellore Tour: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. నెల్లూరు జిల్లాలో పర్యటించారు.. నెల్లూరు సెంట్రల్‌ జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించిన ఆయన.. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డికి ఇంటికి వెళ్లారు.. అయితే, జగన్‌ నెల్లూరు పర్యటన సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. వైసీపీ శ్రేణులపై పోలీసులు లాఠీఛార్జ్‌ కూడా చేయాల్సి వచ్చింది.. మరోవైపు.. జగన్ పర్యటనకు సంబంధించి వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి.. జగన్‌ను చూసేందుకు వెళ్తూ ప్రభుత్వ ఆసుపత్రి గోడను కూల్చేశారంటూ వైసీపీ నేతలపై దర్గామిట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.. ఇప్పటికే ప్రసన్నకుమార్‌ రెడ్డిపై రెండు కేసులు నమోదు అయ్యాయి.. అనుమతులు లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించారని వైసీపీ నేతలపై మరో కేసు నమోదు కాగా.. ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేశారు దర్గామిట్ట పోలీసులు..

Read Also: Pregnant women : తల్లి అయ్యే ముందు తెలుసుకోవలసిన 5 ముఖ్యమైన విషయాలు !

కాగా, నెల్లూరు పర్యటనలో కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. నా పార్టీ నాయకుడిని పరామర్శించడానికి కూడా నేను వెళ్ళకూడదా? అని ప్రశ్నించారు.. నా వెనుక జనం రాకుండా, నా పర్యటనలకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు..? జనం రాకుండా రోడ్లను తవ్వేశారు.. ప్రజలను రాకుండా ఆపడానికి 2 వేల మంది పోలీసులు అంతగా శ్రమించాల్సిన అవసరం ఏముంది ? బాబు గారి ప్రభుత్వం మంచిగా పరిపాలిస్తే… ఎందుకు ఇంత భయపడుతుంది..? తన పాలనను చూసి చంద్రబాబు భయపడుతున్నాడు.. విద్య వైద్య రంగాలను పూర్తిగా నాశనం చేశారు అని ఫైర్‌ అయ్యారు.. మా పార్టీ నాయకుడైన ప్రసన్న ఇంట్లోకి టీడీపీ గూండాలు చొరబడి బీభత్సం సృష్టించారు.. రోజా , విడుదల రజిని పై కారు కూతలు కూస్తున్నారు.. తప్పుడు కేసులు పెట్టి మా పార్టీ నేతలను వేధిస్తున్నారు.. ఏ తప్పు చేశాడని కాకానిని జైల్లో పెట్టారు ? అని ప్రశ్నించారు.. అయితే, జగన్‌ పర్యటనపై అదేస్థాయిలో విరుచుకుపడ్డారు కూటమి నేతలు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు..

Exit mobile version