NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: అజ్ఞాతంలోకి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి..

Kakani

Kakani

Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లాలోకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. నిన్న (మార్చ్ 28) ఉదయం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన కాకాణి. విజయవాడలోని న్యాయవాది నుంచి ఫోన్ రావడంతో ఆయనను కలిసేందుకు వెళుతున్నట్లు నేతలకు చెప్పినట్లు సమాచారం. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ కు సహకరించారని కాకాణిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also: Mega158 : అనిల్ రావిపూడి మెగాస్టార్ సినిమాకు ముహూర్తం ఫిక్స్..

అయితే, ఈ కేసులో బెయిల్ కోసం హైకోర్టును ఇప్పటికే కాకాణి ఆశ్రయించారు. అయితే, విచారణను మంగళవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది. ఇక, కోర్టుకు వరుసగా సెలవులు రావడంతో పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని భావించి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు పార్టీ నేతలు భావిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పొదలకూరు పోలీసులు.