South Central Railway: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. రద్దీ దృష్ట్యా ఈనెల 12 నుంచి పలు ప్రాంతాలకు ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-తిరుపతి, హైదరాబాద్-గోరఖ్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 12న సికింద్రాబాద్-తిరుపతి మధ్య (రైలు నంబర్ 07411) ప్రత్యేక రైలును నడుపుతున్నామని తెలిపారు. ఈ రైలు సికింద్రాబాద్‌లో సాయంత్రం 6:40 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 6:45 గంటలకు తిరుపతి చేరుతుంది. ఈనెల 13న తిరుపతి-సికింద్రాబాద్ మధ్య (రైలు నంబర్ 07412) ప్రత్యేక రైలు నడుస్తుంది. ఈ రైలు తిరుపతిలో సాయంత్రం 5:15 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 5:55 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఈ రెండు ప్రత్యేక రైళ్లు జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.
Read Also: Fire : కార్లలో మంటలు.. కలవరపడిన ప్రయాణికులు
అటు ఈనెల 14న హైదరాబాద్-గోరఖ్‌పూర్ మధ్య ప్రత్యేక రైలు నడవనుంది. ఈ రైలు హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి 9:05 గంటలకు బయలుదేరి.. ఆదివారం ఉదయం 6:30 గంటలకు గోరఖ్‌పూర్ చేరుతుంది. ఈనెల 16న గోరఖ్‌పూర్-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైలు నడుస్తుంది. ఈ రైలు గోరఖ్‌పూర్‌లో ఆదివారం ఉదయం 8:30 గంటలకు బయలుదేరి.. సోమవారం సాయంత్రం 4:20 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఈ రెండు రైళ్లు సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బలర్షా, నాగ్ పూర్, భోపాల్, బినా, కాన్ పూర్, లక్నో స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వెల్లడించారు. అటు ఈనెల 15న బెంగళూరు-విశాఖ మధ్య ప్రత్యేక రైలు నడుస్తుంది. ఈ రైలు బెంగళూరులో మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు విశాఖ చేరుతుంది. ఈనెల 12న బెంగళూరు-జోధ్‌పూర్ మధ్య ప్రత్యేక రైలు నడవనుంది. ఈ రైలు బెంగళూరులో ఉదయం 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:15 గంటలకు జోధ్‌పూర్ చేరుతుంది.