గంజాయి సాగు, రవాణా కట్టడే మా టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి మత్తు వేధిస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒకచోట గంజాయి పట్టుబడుతూనే వుంది. విశాఖ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో గంజాయి సాగు, రవాణా అరికట్టే పనిలో నిమగ్నం అయ్యారు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నిర్మూలించే పనిలో బిజీ అయ్యారు. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ప్రభుత్వ శాఖల సమన్వయంతో పోలీసులు,ఎస్ఈబీ బృందాలు గంజాయి పంటను ధ్వంసం చేస్తున్నారని స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ అన్నారు.

విశాఖ ఏజెన్సీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దులో శుక్రవారం మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ, మేడూరు గ్రామంలో తమ శాఖ చేపడుతున్న గంజాయి ద్వంసాన్ని ఆయన పరిశీలించారు. చింతపల్లి,జికె వీధి మండలాల్లో గత 11 రోజులుగా సుమారు 2,100 ఎకరాలకు పైగా గంజాయి సాగు నాశనమైందన్నారు. మేడూరు గ్రామంలోని సుమారు 72 ఎకరాల గంజాయి పంటను ధ్వంసం చేశారన్నారు.
Also Read
- Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
- Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్‌షీట్‌పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
- CM Chandrababu : భూములకు బ్లాక్‌చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్‌కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
సాగు చేసిన గంజాయి తోటలను ధ్వంసం చేసిన మేడూరు గ్రామ సర్పంచ్‌కు నగదు బహుమతిని అందజేశారు. ఐటీడీఏ ద్వారా ప్రత్యామ్నాయ పంటలకు సహకారం అందిస్తామన్నారు.గంజాయి సాగు,రవాణా ఆపడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.గంజాయి సాగు విధ్వంసం కొనసాగుతునే వుంటుందన్నారు.గంజాయి స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు, ఎస్ఈబీ బృందాలు రాష్ట్రంలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి కృష్ణారావు,ఎస్ఈబి జెడి ఎస్ సతీష్ కుమార్,ఎఎస్పీ తుషార్ డూడి,సిఐ టి శ్రీనువాసు,అన్నవరం ఎస్ఐ ఎన్ ప్రశాంత్ కుమార్,సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Delhi: జంతర్‌మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్‌లో రాజకీయ కల్లోలం..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?