Site icon NTV Telugu

AP Assembly: పోడియం దగ్గరకు వస్తే ఆటోమేటిక్‌గా సస్పెన్షన్‌.. స్పీకర్‌ రూలింగ్‌

Speaker

Speaker

AP Assembly: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఇవాళ ఏకంగా ఎమెల్యేల మధ్య ఘర్షణ వరకు వెళ్లింది పరిస్థితి.. మాపై దాడి చేశారంటే.. లేదు మాపైనే దాడి చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.. అయితే, టీడీపీ సభ్యుల తీరు నేపథ్యంలో సభలో రూలింగ్ ఇచ్చారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. స్పీకర్ పోడియం ఎక్కి నిరసన వ్యక్తం చేస్తే ఆటోమేటిక్‌గా సంబంధిత సభ్యులకు సస్పెన్షన్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.. ఇక, సభలో టీడీపీ సభ్యుల తీరు ఆక్షేపణీయం అన్నారు స్పీకర్.. పార్లమెంటు రూల్ 374 ఏ, 2001 ప్రకారం సభ్యులు అందరూ రూల్ పాటించాల్సిందే అన్నారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ప్రతిపాదన పంపిస్తే.. ప్రివిలేజ్ కమిటీకి ఆదేశిస్తాను అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.. అయితే, ప్రివిలేజ్ కమిటీకి పంపించాలని మంత్రి ఆదిమూలపు సురేష్.. స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కోరారు.

Read Also: Chandrababu Naidu: శాసన సభ కాదు.. కౌరవ సభ.. చరిత్రలో ఇది చీకటి రోజు.

కాగా, స్పీకర్‌తో టీడీపీ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించారు.. అడ్డుకోవడానికి మేం వెళ్తే.. మమ్మల్ని తోసేశారు.. మాపై దాడి చేశారని వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.. ఇక, సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి దాడి ఘటనను తీసుకెళ్లారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యేలు సుధాకర్‌బాబు, ఎలిజా.. ముఖ్యమంత్రిని కలిసి తమపై జరిగిన దాడి ఘటనపై వివరించారు.. టీడీపీ ఎమ్మెల్యేల స్పీకర్ పోడియం పైకి దూసుకుని రావటం, ప్లకార్డులను ఆయన ముఖం పై పెట్టడం, చేయి వేయటం వంటి ఘటనలను సీఎం జగన్ కు వివరించారు. మరోవైపు.. ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయిననాటి నుంచి ప్రతీరోజు సభ నుంచి ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురవుతోన్న విషయం విదితమే.

Exit mobile version