Site icon NTV Telugu

Sabarimala: శబరిమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్

Shabarimala

Shabarimala

శబరిమల భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలలో 38 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. శబరిమల వెళ్లే వారి కోసం 38 ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వెల్లడించారు. ఏయే తేదీల్లో రైళ్లు అందుబాటులో ఉంటాయి.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తాయి అనే వివరాలను ప్రకటించింది.

Read also: Astrology : నవంబర్‌ 26, శనివారం దినఫలాలు

హైదరాబాద్-కొల్లాం (ట్రైన్ నెం. 07133) డిసెంబర్ 5, 12, 19 మరియు 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. జనవరిలో కూడా ఇది 2, 9 మరియు 16 తేదీల్లో నడుస్తుంది. కొల్లాం-హైదరాబాద్ (రైలు నంబర్ 07134) డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 తేదీల్లో నడుస్తుంది. ఈ సేవలు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్ లాంటి కొన్ని ఇతర ప్రధాన స్టేషన్లలో ఆగనుంది.

సికింద్రాబాద్-కొట్టాయం (ట్రైన్ నెం. 07125) డిసెంబర్ 4, 11, 18, 25, జనవరి 1, 8 తేదీల్లో నడుస్తుంది. అలాగే, కొట్టాయం-సికింద్రాబాద్ సర్వీస్ (ట్రైన్ నంబర్ 07126) డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. జనవరి 2, 9. ఈ రైలు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కోయంబత్తూరు వంటి అన్ని ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది.

Read also: Delivery Boy Kiss woman : డెలివరీ ఇచ్చాడు.. ముద్దు పెట్టాడు.. ఆ డెలివరీ బాయ్‎ని ఆమె ఏం చేసిందంటే

ఆంధ్రప్రదేశ్‌ నుంచి..
నర్సాపురం-కొట్టాయం మధ్య (రైలు నంబర్ 07119) డిసెంబర్ 2, 9, 16, 30 , జనవరి 6, 13 తేదీల్లో నడుస్తుంది. అలాగే, కొట్టాయం-నర్సాపురం (ట్రైన్ నంబర్. 07120) డిసెంబర్ 3, 10, 17, 31 తేదీల్లో నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 7, 14. పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కోయంబత్తూరు సహా అన్ని ప్రధాన స్టేషన్లలో రైలు ఆగుతుంది.
Cold Wave in Adilabad: మళ్ళీ పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న చలి

Exit mobile version