NTV Telugu Site icon

Kollu Ravindra: త్వరలో ఏపీలో మంచి మైనింగ్ పాలసీ తీసుకొస్తాం..!

Kollu Ravindra

Kollu Ravindra

Kollu Ravindra: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో మంచి మైనింగ్ పాలసీ తీసుకు వస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయంలో బాధితులుగా ఉన్న స్టోన్ క్రషర్స్, మిల్లర్స్ నిర్వహకులతో సమావేశం నిర్వహించామన్నారు. గత మైనింగ్ మంత్రి రాష్ట్రంలోని బెదిరింపులకు పాల్పడి మైనింగ్ ను పూర్తిగా అస్తగతం చేసుకున్నారని ఆరోపించారు. లొంగని వారిపై అధికారులను పంపించి అక్రమంగా కేసులు పెట్టించారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక మంది క్వారీలు నిర్వహించలేక మూసేసుకున్నారు.. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి కలిసి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారు అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన స్టోన్ క్రషర్స్, మిల్లర్స్ సమస్యలు మా దృష్టికి తీసుకు వచ్చారు.. గడిచిన ఐదేళ్లలో ఇసుకలో అక్రమంకు వసూల్లు చేశారని ఆరోపించారు. ఇక, వైసీపీ ప్రభుత్వంలో భవన నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింది అని కొల్లు రవీంద్ర వెల్లడించారు.

Read Also: AB PM-JAY: వృద్ధులకు ప్రధాని మోడీ దీపావళి కానుక.. ఏటా 5 లక్షల వరకు..

ఇక, సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుకను అమలు చేశారని మంత్రి రవీంద్ర చెప్పుకొచ్చారు. ఎడ్ల బండ్లపై, ట్రాక్టర్లపై ఉచితంగా ఇసుక తీసుకెళ్లే వెసులుబాటు కల్పించాం.. రాష్ట్రంలో సినారేజ్ చార్జీలు లేకుండా ఇసుక అందిస్తున్నాం.. రాష్ట్రంలో ఇసుకను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పని చేస్తుంది అని వెల్లడించారు. అలాగే, విశాఖపట్నంలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నాం.. నాతవరం మండలంలో సారుగుడు, సుందరకోట పంచాయితీలలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన లాటరైట్ త్రవ్వకాలపై విచారణ కొనసాగుతుంది.. ఈ వ్యవహారంలో కొందరు మంత్రులపై ఫిర్యాదులు వచ్చాయి.. విచారణ తరువాత చర్యలు తీసుకుంటాము.. ఇసుకలో అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం.. జిల్లా సరిహద్దులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం.. మద్యాన్ని జగన్ కబంధహస్తాలలో పెట్టుకున్నారు.. ఎక్సైజ్ పాలసీని విచ్ఛిన్నం చేశారు.. ప్రభుత్వ దుకాణాలు పెట్టి వారికి కావలసిన బ్రాండ్లు విక్రయించారు.. బెల్ట్ షాపులు పెడితే ఉపేక్షించేది లేదు.. ఎంఆర్పీ రేట్లు కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.